బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న మ్యారేజ్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉంటూ వచ్చిన ఈ కపుల్స్ పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేశారు. అయితే ఏప్రిల్ లో పెళ్లైతే నెలలోనే అలియా ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ చేసింది. అక్కడ ఏం జరిగిందో కానీ అలియా భట్ తల్లి అవబోతుంది అన్న ఫీలింగ్ ని ప్రతి నిమిషం ఎంజాయ్ చేసింది. ఆ టైం లోనే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కూడా చేసింది అలియా భట్. బ్రహ్మాస్త్ర కోసం ఆమె బేబీ బంప్ తోనే కనిపించింది.
ఆదివారం రణ్ బీర్ అలియా దంపతులకు బేబీ జన్మించిన విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీలోకి ఒక కొత్త వ్యక్తికి వెల్ కం చెప్పారు ఈ స్టార్ కపుల్. అలియా బేబీ విషయం తెలిసిన బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వారిని విష్ చేశారు. లేటెస్ట్ గా వీరిలో హాలీవుడ్ స్టార్స్ కూడా ఉండటం విశేషం.
రణ్ బీర్ అలియాలు తమ ప్రపంచంలోకి ఓ బేబీని ఆహ్వానించారు. ఈ విషయం తెలిసి హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్ కూడా అలియాకు తన విషెస్ అందించారు. కంగ్రాట్స్ అంటూ లవ్ సింబల్ పెట్టి ఆమె కామెంట్ చేశారు.
ఇంతకీ హాలీవుడ్ నటికి అలియా భట్ కి సంబంధం ఏంటి అంటే.. అలియా భట్ ప్రస్తుతం హర్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో అలియా భట్ తో పాటుగా గాల్ గాడోట్ కూడా నటిస్తుంది.
ఆ పరిచయం కొద్దీ అలియా భట్ బేబీకి తన విషెస్ అందించింది హాలీవుడ్ నటి. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా అలియా తన మ్యాజిక్ కొనసాగించాలని చూస్తుంది. నటన పట్ల తనకున్న కమిట్మెంట్ ఎలాంటిది అంటే RRR సినిమాలో నటించిన అలియా ఆ టైం లో తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నించింది. అంతేకాదు భర్త రణ్ బీర్ తో చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినిమా కోసం కూడ హైదరాబాద్ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు ఆ సినిమాలో పాటని తెలుగులో పాడి వినిపించింది. కేవలం నటించడం మాత్రమే కాదు మనం చేస్తున్న పని పట్ల శ్రద్ధ ఉంటేనే ఇలాంటివి చేయగలం అని అలియా ప్రూవ్ చేసింది.
ఇక ఇప్పుడు ఆమె కోసం హాలీవుడ్ స్టార్స్ సైతం ప్రత్యేక విషెస్ అందిస్తున్నారు. రణ్ బీర్ అలియా భట్ ల జోడీ బాలీవుడ్ క్రేజీ జంటగా వరుస సినిమాలు చేస్తున్నారు. బ్రహ్మస్త్ర తర్వాత మరో రెండు సినిమాలు కూడా వీరి కాంబినేషన్ లో వస్తున్నాయని తెలుస్తుంది.