కొత్త హీరోయిన్ ‘కోటి’రాగాలు తీస్తుంది..!

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి మొదటి సినిమాతోనే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న శ్రీలీల వరుస ఛాన్సులతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇద్దరు స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ తో కూడా షాక్ ఇస్తుందని తెలుస్తుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ కాబట్టి ఆమెని చాలా అందంగా చూపించారు. ఒక్క సినిమాతోనే సూపర్ పాపులర్ అయిన శ్రీలీల వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది.

ఇప్పటికే మాస్ మహరాజ్ రవితేజతో ధమాకా మూవీలో నటిస్తున్న శ్రీలీల రామ్ బోయపాటి శ్రీను కాంబో లో కూడా సైన్ చేసింది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లో శ్రీలీల కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఈ సినిమా కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 20 లక్షలు మత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ సినిమాకు 50 లక్షల దాకా డిమాండ్ చేసిందట. లేటెస్ట్ గా రామ్ సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు కోటి అడిగేస్తుందట శ్రీలీల.

క్రేజ్ ఉన్నప్పుడే డిమాండ్ చేయాలన్న ఫార్ములా అప్పుడే పసిగట్టేసిన శ్రీలీల రెమ్యునరేషన్ విషయంలో గట్టి పట్టే పడుతుంది. ఎలాగు రవితేజ రామ్ సినిమాలు రిలీజ్ టైం లో మరో రెడు మూడు సినిమాలు లైన్ లో ఉంటాయి. ఆ సినిమాలు హిట్ పడితే మళ్లీ రెమ్యునరేషన్ పెంచేయాలని ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం కోటి దాకా పారితోషికం అడిగేస్తుంది శ్రీలీల. హీరోయిన్స్ వెలితి ఉన్న టాలీవుడ్ లో పదుల సంఖ్యలో ఇంట్రడ్యూస్ అవుతున్నా ఒకరిద్దరు మాత్రమే క్లిక్ అవుతున్నారు.

కన్నడ భామ శ్రీలీల దూకుడు చూస్తుంటే టాలీవుడ్ లో కొన్నాళ్లు తన సత్తా చాటేలా ఉంది. ధమాకా నుంచి వచ్చిన ఒక మాస్ సాంగ్ లో తన మూమెంట్స్ తో మరోసారి ఆడియన్స్ ని మెప్పించింది శ్రీలీల. మరి ఇలానే దూసుకెళ్తే మాత్రం అమ్మడికి టాప్ ప్లేస్ ఇచ్చినా ఇచ్చేస్తారు మన ప్రేక్షకులు. బ్యూటీ విత్ టాలెంట్ అన్నట్టుగా శ్రీలీల తెలుగులో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. సో ఇలాంటి టైం లో అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడంలో కూడా తప్పేమి లేదని చెప్పొచ్చు.