నువ్వు నేను సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ అనిత. తెలుగు లో ఈమె చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ లో కొనసాగిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది.
అనిత హీరోయిన్ గా చేసిన సినిమాలు ఇప్పటికి బుల్లి తెరపై చూసిన ప్రేక్షకులు ఆమె పై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. అందంతో పాటు మంచి నటన ఆమె సొంతం అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి అనిత ఆ మధ్య మరీ ఎక్కువ బరువు పెరగడంతో పాటు పొట్ట కూడా ఎబ్బెట్టుగా పెరిగింది.
పెళ్లి.. ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణంగా అమ్మాయిలు కాస్త లావు అవ్వడం జరుగుతుంది. అనిత కూడా అలాగే లావు అయ్యింది.
అయితే ఆమె పట్టుదలతో బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. కాస్త ఎక్కువగానే కష్టపడి సాధ్యం అయినంత వరకు బరువు తగ్గింది.
అనిత లావుగా ఉన్నప్పుడు మరియు లావు తగ్గిన తర్వాత అన్నట్లుగా ఒక వీడియోను షేర్ చేసింది. నిజంగా మ్యాజిక్ అన్నట్లుగా చాలా బరువును అనిత తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. గతంలో పొట్ట ఎబ్బెట్టుగా ఉండేది కానీ ఇప్పుడు పొట్ట అనేది చాలా వరకు తగ్గింది.
అంతే కాకుండా ఫిజిక్ పరంగా కూడా ముద్దుగుమ్మ చాలా సన్నబడింది. దాంతో ఈమె మళ్లీ సినిమా ల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అనిత తాజా లుక్ చూస్తూ ఉంటే కచ్చితంగా రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తుందేమో అనే చర్చ మొదలు అయ్యింది.