తల్లి అయిన మరో బాలీవుడ్ హీరోయిన్

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. రణబీర్ కపూర్ లో ఆలియా పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే తల్లి అయ్యింది. ప్రస్తుతం ఆలియా మరియు రణబీర్ కపూర్ లు తల్లిదండ్రులుగా సరికొత్త ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా వారి యొక్క సన్నిహితులు మరియు మిత్రులు మాట్లాడుకుంటున్నారు.

ఇదే సమయంలో మరో బాలీవుడ్ హీరోయిన్ అయిన బిపాషా బసు కూడా తల్లి అయ్యింది. సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతూ వస్తున్న ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానంను దక్కించుకుని స్టార్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ బిపాషా తల్లి అయిన వార్త వైరల్ అయ్యింది.

ఆలియా మాదిరిగానే బిపాషా బసు కూడా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తెలియజేయడం జరిగిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ను పలువురు బాలీవుడ్ ప్రముఖులు షేర్ చేయడం జరిగింది.

2016 సంవత్సరంలో బిపాషా బసు మరియు కరణ్ సింగ్ గ్రోవర్ లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యి ఆరు ఏళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో వీరు తల్లిదండ్రులు అయ్యారు.

ఒకప్పుడు చాలా మంది స్టార్స్ పెళ్లి తర్వాత పిల్లలకు సమయం తీసుకునే వారు. కానీ ఇప్పుడు కొందరు స్టార్స్ మాత్రం పెళ్లి తర్వాత పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. పిల్లలను కని ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు.