ప్రతి నిమిషం కష్టపడ్డా.. యంగ్ హీరో ఎమోషనల్

గోల్కొండ హైస్కూల్ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయిన దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ వరుసగా సినిమాల్లో నటిస్తూ హీరోగా మంచి పేరు దక్కించుకునేందుకు.. నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకున్నా కూడా హీరో సంతోష్ శోభన్ కి మరోసారి మంచి పేరు దక్కింది అనడంలో సందేహం లేదు. హీరోగా సంతోష్ శోభన్ కి ప్రభాస్ మరియు మహేష్ బాబు వంటి స్టార్స్ నుండి ప్రోత్సాహం దక్కింది.

దర్శకుడు శోభన్ తో ఉన్న మంచి సంబంధాల కారణంగా సంతోష్ శోభన్ యొక్క సినిమాలకు ప్రభాస్.. మహేష్ బాబుతో పాటు మరి కొంత మంది కూడా ప్రమోట్ చేసేందుకు ముందుక వచ్చారు. ఈ సమయంలో సంతోష్ శోభన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇన్ స్టా లో సంతోష్ శోభన్.. నా మొదటి సినిమా మొదలుకుని ఇప్పటి వరకు ఎంతో మంది ప్రోత్సాహం నాకు దక్కింది. మొదటి సారి కెమెరాను ఎదుర్కొన్న సమయంలో భావోద్వేగానికి గురి అయ్యాను. నటన పట్ల నాకు ఉన్న ఆసక్తి తో ప్రతి నిమిషం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు కష్టపడ్డాను. ప్రతి నిమిషం నన్ను నేను మార్చుకుంటూ సినిమాల్లో నటిస్తున్నాను అన్నాడు.

కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులను అలరించేందుకు చాలా కష్ట పడ్డా కూడా ఫలితం దక్కకున్నా కూడా మళ్లీ మళ్లీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు చేస్తాను అన్నట్లుగా సంతోష్ శోభన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ లో ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.