సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ ప్రపంచం అంతా మూగబోయింది. అభిమానులంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విషాద చాయలు అలమున్నాయి. ఆయన నట ప్రస్థానం గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కృష్ణ గారి మీద తమ అభిమానాన్ని చాటుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అయితే ఈ టైం లో మహేష్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మేజర్ సినిమా టైం లో మహేష్ తండ్రి కృష్ణ గారి బయోపిక్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అని రిపోర్టర్ అడిగితే.. నాన్న గారి బయోపిక్ ఎవరైనా చేస్తే మొదట చూడటానికి తానే ఆనందంగా వస్తానని.. తను అయితే చేయలేనని ఆయన నా దేవుడు అని అన్నారు మహేష్.
ఇప్పుడు దేవుడు దూరమయ్యాడు.. మహేష్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిజమైన సినీ వారసుడిగా మహేష్ ని చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి స్టార్ గా మారేదాకా కృష్ణ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
మహేష్ లోని చురుకుదనం చూసే అతనో పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నారు కృష్ణ. ఆ విధంగానే చిన్నప్పుడే కెమెరా ఫియర్ ఉండకూదని మహేష్ తో షూటింగ్ ప్లాన్ చేశారు. స్టడీస్ కి ఇబ్బంది అవకూడదు అనుకుని సమ్మర్ హాలీడేస్ లో షూటింగ్ ఫిక్స్ చేసేవారు. ఇలా మహేష్ కెరీర్ విషయంలో ముందు నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు కృష్ణ.
రాజకుమారుడు సినిమాతో మహేష్ కి గ్రాండ్ ఎంట్రీ చేయించిన కృష్ణ ఆ సినిమాలో ఆయన కూడా నటించారు. మొదటి ఐదారు సినిమాలకు కథల విషయంలో కూడా కృష్ణ సహకరించగా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాక కథలను తననే సెలెక్ట్ చేసుకోమని చెప్పేశారట కృష్ణ.
అంతేకాదు కథల విషయంలో కృష్ణ సలహాలను ఇప్పటికీ పాటిస్తూ వచ్చారు మహేష్. మహేష్ ప్రతి సినిమా రిలీజ్ ముందు కానీ.. రిలీజ్ తర్వాత కానీ కృష్ణ గారికి చూపించి ఆయన సజెషన్స్ తీసుకునే వారు. సినిమా బాగుంటేనే నచ్చిందని లేకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా బాగా లేదని తన ఫ్రాంక్ రివ్యూ ఇచ్చేవారట కృష్ణ.
అలాంటి తండ్రిని కోల్పోయిన మహేష్ ని చూసి అభిమానులు బాధపడుతున్నారు. మహేష్ కి ఈ ఇయర్ ఇది మూడవ దెబ్బ.. ఆల్రెడీ ఈ ఇయర్ మొదట్లోనే అన్న రమేష్ బాబుని కోల్పోగా.. రెండు నెలల క్రితమే మదర్ ఇందిరా దేవి కూడా కాలం చేశారు. ఇక ఇప్పుడు తన దేవుడు అనుకున్న తండ్రి కృష్ణ కూడా మహేష్ ని ఒంటరివాడిని చేసి వెళ్లిపోయారు. మహేష్ కి వచ్చిన కష్టం మరే ఒక్కరికి రాకూడదని.. మహేష్ సపోర్ట్ గా స్టే స్ట్రాంగ్ మహేష్ అన్నా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సపోర్ట్ గా ఉన్నారు.