నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా వీరసింహారెడ్డిని ఫినిష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం కూడా ఫైనల్ అయిపోయింది. షైన్ స్కీన్ నిర్మతలు కూడా దాదాపు నటీనటులకు సంబంధించిన డేట్స్ కూడా ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.
అయితే మెయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఈ సినిమాల్లో బాలయ్య బాబు కూతురిగా శ్రీ లీలా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.
అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. నయనతారతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరపడం జరిగింది. దర్శకుడు కథ కూడా చెప్పాడు. కథ విషయంలో మాత్రం నయన్ పెద్దగా డౌట్స్ ఏమి క్రియేట్ చేయలేదు.
కానీ రెమ్యునరేషన్ తోనే ఆమె నిర్మాతలను భయపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నయన్ తన రేంజ్ కు తగ్గట్టుగానే ఎనిమిది నుంచి పది కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తుంది.
అట్లీ దర్శకత్వంలో షారుఖాన్ తో చేస్తున్న జవాన్ సినిమా కోసం ఆమె 10 కోట్ల తీసుకుంటున్నట్లుగా టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు బాలయ్య సినిమా కోసం 8 నుంచి పది కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో ఏ హీరోయిన్ రెమ్యునరేషన్ అందుకోలేదు. ఇక లేడీ సూపర్ స్టార్ రేంజ్ అయితే ఇప్పుడు అదే తరహాలో ఉంది. కాబట్టి ఆమె మార్కెట్ ను బట్టి ఆ స్థాయిలో ఇవ్వాల్సిందే. మరి ఈ విషయంలో షైన్ స్క్రీన్స్ నిర్మతలు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.