ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. 2010లో వచ్చిన అవతార్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగానే విడుదలవుతున్న ఈ సినిమా కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అక్కుతున్నాయి.
ఇక టికెట్ల రేట్ల విషయంపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని థియేటర్లలో అత్యధికంగా 1450 రూపాయల ఒక టికెట్ అమ్ముడవుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా ఈ సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఎంత రేట్లు పెట్టినా తక్కువే అని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఈ రేంజ్ లో సినిమా టికెట్లు రేట్లు ఉంటే ఒక మధ్య తరగతి సినీ లవర్స్ ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని చెప్పవచ్చు. ఇక అత్యధికంగా అయితే ఇండియాలో బెంగళూరులోని ఐమాక్స్ 3D ఫార్మాట్లో ఒక్క టికెట్ ధర 1450 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇక పూణేలో కూడా 4DX 3D ఈ సినిమా టికెట్ ధర 1200 రూపాయలకు ఫిక్స్ చేశారు.
ఢిల్లీ ముంబై కొలకత్తాలో కూడా 770 రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో టికెట్ రేట్లు కొనసాగుతున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగానే డిస్ట్రిబ్యూటర్లు సినిమా టికెట్లను ఫిక్స్ చేసుకున్నారు ఎక్కువగా ఐనాక్స్ 3D 4DX ఫార్మాట్స్ కు అత్యధిక రేట్లు అయితే ఫిక్స్ చేశారు. ఇక హైదరాబాదులో 4DX 3D ఫార్మాట్లో ఒక టికెట్ ధర 350 రూపాయలకు రేటు ఫిక్స్ చేస్తున్నారు.
ఇక వైజాగ్లో అయితే త్రీడీ ఫార్మాట్లో 210 రూపాయల కు ఒక టికెట్ అమ్ముతున్నారు. దాదాపు 1600 కోట్ల భారీ బడ్జెట్ తో తరికెక్కిన ఈ సినిమా అయితే మొదటి వారంలోనే ఆ టార్గెట్ ను పూర్తి చేస్తుందని చెప్పవచ్చు. మరి కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి.