కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హాన్సిక డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన బిజినెస్ పార్ట్ నర్ సోహైల్ తోనే ఆమె పెళ్లి జరుగబోతుంది. రీసెంట్ గా తన మ్యారేజ్ గురించి ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హాన్సిక ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. సోమవారం నుంచి మొదలైన హాన్సిక పెళ్లి వేడుకలో భాగంగా అమ్మడు కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా హాన్సిక రెడ్ కలర్ డ్రెస్ లో దేవకన్యగా మెరిసిపోతుంది. అమ్మడిని చూసి పెళ్లి కళ వచ్చేసింది అంటూ చెప్పుకుంటున్నారు.
మోడల్ గా చేస్తూ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాన్సిక. మొదటి సినిమానే అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేయగా అప్పటి నుంచి తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఓ మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్న హాన్సిక తమిళంలో మాత్రం సూపర్ పాపులర్ అయ్యింది. అక్కడ హాన్సిక కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కెరీర్ మొదలు పెట్టి తమిళంలో సక్సెస్ అయిన భామల్లో హాన్సిక ఒకరు.
కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్న టైం లో హాన్సిక తన పెళ్లి వార్తతో అందరిని సర్ ప్రైజ్ చేసింది. తన స్నేహితుడు సోహైల్ నే పెళ్లాడుతున్నట్టుగా ఎనౌన్స్ చేసి మరింత షాక్ ఇచ్చింది హాన్సిక. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
రాజస్థాన్ లోని ప్యాలెస్ లో హాన్సిక మ్యారేజ్ జరుగబోతుంది. కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఈ వేడుకలకు అటెండ్ అవుతారని తెలుస్తుంది. మ్యారేజ్ కూడా కొద్ది మంది సమక్షంలోనే ప్లాన్ చేశారట. రిసెప్షన్ కి మాత్రం అందరికీ ఆహ్వానం పంపించాలని అనుకుంటున్నారట.
తెలుగు తమిళ భాషల్లో దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన హాన్సిక మ్యారేజ్ న్యూస్ ఆమె ఫ్యాన్స్ ని ఓ పక్క బాధ పెడుతున్నా అమ్మడు లైఫ్ లో సెటిల్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
నయనతార ఎలాగు ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు చేస్తుంది. అదే దారిలో హాన్సిక కూడా మ్యారేజ్ అయ్యాక కూడా సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం హాన్సిక మ్యారేజ్ హంగామా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హాన్సిక కూడా తన మ్యారేజ్ వీడియో రైట్స్ ని డిస్నీ హాట్ స్టార్ కి అమ్మినట్టు టాక్.