సినిమాల్లో హీరో అంటే మంచి ఎత్తూ.. పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్న అందగాడు అయ్యుండాలి.. అందం అభినయంతో పాటుగా స్టైలిష్ గా ఉండాలి అని సినీ అభిమానులు కోరుకుంటారు. గ్లామర్ కు మంచి హెయిర్ స్టైల్ తోడైతే మరింత ఆకర్షణీయంగా స్క్రీన్ మీద కనిపిస్తారని భావిస్తారు.
టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటారు. తమని అనుసరించేవారు చాలామంది ఉంటారు కాబట్టి.. కేశాలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలానే సినిమాలో తమ పాత్రకు తగ్గట్టుగా సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు.
యంగ్ హీరోల దగ్గర నుంచి విగ్ ఉపయోగించే సీనియర్ హీరోలు వరకూ అందరూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు హెయిర్ స్టైల్ తో ప్రయోగాలు చేస్తున్నవారు కూడా వున్నారు.
అయితే తమకు తగిన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే.. ఒక్కోసారి సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో లుక్స్ మరియు హెయిర్ స్టైల్ పరంగా ఎక్కువగా ట్రోల్స్ ఫేస్ చేసిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి.
ఒకప్పుడు హండ్సమ్ హంక్ అనిపించుకున్న ప్రభాస్.. ఈ మధ్య తన ఫిజిక్ ని గాలికి వదిలేసినట్లు ఉందని.. డార్లింగ్ ముఖంలో మునుపటి కళ కనిపించడం లేదని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అలానే ఎల్లప్పుడూ ప్రభాస్ తన హెయిర్ ని కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడంపైనా గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ప్రభాస్ హెయిర్ బాండ్ తో అన్న ఫొటోలను షేర్ చేస్తూ.. సాయి బాబా గెటప్ కి బాగా సూటవుతాడని ట్రోల్ చేశారు. నిజానికి గత కొంతకాలంగా ప్రభాస్ ఎప్పుడు చూసినా తలకు క్యాప్ పెట్టుకునే కనిపిస్తున్నాడు. సినిమా ఈవెంట్స్ కు కూడా అలానే వస్తున్నాడు.
ఇటీవల లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ప్రభాస్ తన హెయిర్ ని బ్లాక్ క్యాప్ తో కవర్ చేసి కనిపించాడు. దీంతో ప్రభాస్ హెయిర్ కి ఏమైంది? ఎందుకు ఎప్పుడూ కవర్ చేసుకొని కనిపిస్తున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభాస్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. డార్లింగ్ – మిర్చి లాంటి చిత్రాల్లో తమ అభిమాన హీరోని మంచి హెయిర్ స్టైల్ లో చూసిన మహిళాభినానులు.. ఇప్పుడు తరచుగా హెయిర్ బ్యాండ్ తోనే కనిపిస్తుండటంతో ఏమైందని ఆరాలు తీస్తున్నారు. ముఖ్యంగా ఎన్నారై మహిళలు ప్రభాస్ ఎందుకు ఎల్లప్పుడూ క్యాప్ పెట్టుకుంటున్నాడు? అని డిస్కషన్స్ చేస్తున్నారట.
డార్లింగ్ కు హెయిర్ లాస్ అయిందా? లేదా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? కేశాలంకరణ మీద జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సినిమాలలో విగ్ తో మేనేజ్ చేస్తారా? అని ఎన్నారై మహిళలలో వినిపిస్తోంది. మొత్తం మీద ప్రభాస్ హెయిర్ బాండ్ పెట్టుకోవడం మీద గట్టిగానే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.