అవతార్ 2 విజువల్ వండర్ ను కేరళ వారు మిస్ అవ్వనున్నారా?

అవతార్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆ సినిమా యొక్క స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి అవతార్ సినిమా యొక్క సీక్వెల్ రాబోతుంది అంటూ అప్పటి ప్రేక్షకులు.. ఇప్పటి ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హాలీవుడ్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రమే కాకుండా నార్మల్ కామన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా యొక్క విజువల్స్ ను ఎక్సీరియన్స్ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వేల కోట్ల రూపాయలను నమోదు చేయడం కన్ఫర్మ్ అయ్యింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా సాధించబోతున్న కలెక్షన్స్ ఎంత అంటే ఊహకు అందడం లేదు.

ఈ సమయంలో కేరళలో ఈ సినిమాను విడుదల చేసేది లేదు అంటూ డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ఆందోళన అక్కడ సినీ ప్రేక్షకులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచం మొత్తం అవతార్ 2 సినిమాను ఆన్ థియేటర్ విజువల్ వండర్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటే తాము మిస్ అవ్వాల్సి వస్తుందా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాదారణంగా మొదటి వారం సగం సగం పద్దతిలో డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు షేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ కేరళ కు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 65 శాతం తమకు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవతార్ 2 సినిమాను ప్రదర్శించాలంటే 65 శాతం ఇవ్వాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

అవతార్ మేకర్స్ మరియు ఇండియాలో విడుదల చేస్తున్న నిర్మాతలు మాత్రం 55 శాతం ఇచ్చేందుకు ఓకే చెప్పారట. అయినా కూడా 65 శాతం వాటా తమకు ఇవ్వాల్సిందే అని కేరళ డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవతార్ 2 కేరళలో విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రిలీజ్ కు మరో రెండు వారాల సమయం ఉంది కనుక అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతలకు మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది అంటున్నారు. అలా జరగక పోతే మాత్రం కేరళ సినీ ప్రేక్షకులు మరియు ప్రేమికులు విజువల్ వండర్ ను మిస్ అవ్వడం ఖాయం.