స్టార్ కమెడియన్ అలీ సినిమాలతో పాటు టీవీ షోలతోను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలీ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా దశాబ్ధాల పాటు ఏల్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన కుటుంబ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె పెళ్లి వేడుకల కోసం చాలా ఏర్పాట్లతో బిజీ అయిపోయారు.
ఇటీవలే గుంటూరులోని అన్వయ కన్వెన్షన్లో తన కుమార్తె వివాహం.. గ్రాండ్ రిసెప్షన్ను నిర్వహించారు. అయితే అలీ ఇంటల్లుడి వివరాలేవీ ఇంతవరకూ బయటకు రాలేదు.
అభిమానుల ఆరాల ప్రకారం తెలిసిన సంగతులు ఇలా ఉన్నాయి. వరుడు షేక్ షహయాజ్ ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన యువకుడు. చదువుల్లో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిభావంతుడు.
ఆయన ఎంబీబీఎస్ చదివారు. అలీ కూతురు ఫాతిమా డాక్టర్ కావడంతో డాక్టర్ వరుడు దొరికే వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారట. వరుడి కుటుంబ సభ్యులు లండన్ లో నివశిస్తున్నారు. వారి మూలాలు గుంటూరులో ఉన్నాయని తెలిసింది. అంటే వరుడు లండన్ లోనే పెద్ద డాక్టర్ అన్నమాట.
అలీ కూతురు డాక్టరు.. అల్లుడు కూడా డాక్టరే. ఇక కలిసి సొంతంగా ఒక ఆస్పత్రిని ప్రారంభించి ప్రజాసేవలో నిమగ్నమవుతారని అభిమానులు ఆశిస్తూ నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.
ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. కింగ్ నాగార్జున- విక్టరీ వెంకటేష్ సహా టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో అల్లు అరవింద్- బ్రహ్మానందం – హీరో రాజశేఖర్- మంచు విష్ణు-బోయపాటి శ్రీను- శివారెడ్డి తదితరులు ఉన్నారు.