బాలీవుడ్ భామ కియరా అద్వాని తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ముందు సినిమాల్లో సెకండ్ లీడ్ గా నటించిన కియరా ఆ తర్వాత సోలో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఇక్కడ కూడా పాపులర్ అయ్యింది కియరా అద్వాని. మహేష్ తో భరత్ అనే నేను మూవీ చేసి హిట్ అందుకోగా ఆ తర్వాత చరణ్ తో చేసిన వినయ విధేయ రామ మాత్రం అంచనాలను మిస్ అయ్యింది. మరోసారి చరణ్ తోనే జత కడుతుంది కియరా అద్వాని. శంకర్ డైరక్షన్ లో వస్తున్న RC15వ సినిమాలో అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది.
ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవడంతో కియరా గురించి మరోసారి నేషనల్ లెవల్లో డిస్కషన్ నడుస్తుంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్స్ ని అలరిస్తున్న కియరా లేటెస్ట్ గా త్వరలో ఒక గుడ్ న్యూస్ చెబుతానని ఊరించింది. తను చెప్పబోయే గుడ్ న్యూస్ సిద్ధార్థ్ మల్హోత్రాతో మ్యారేజ్ గురించి అని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కియరా తను స్టార్ట్ చేసిన ఒక బ్రాండ్ గురించి చెప్పింది అమ్మడు.
ఈమధ్య బాలీవుడ్ భామలంతా కూడా సొంతంగా బ్యూటీ అండ్ వెల్ నెస్ ప్రొడక్ట్స్ మీద పడ్డారు. అంతకుముందు అలాంటి బ్రాండ్ లకు ప్రకటనలు చేసిన వీరు ఇప్పుడు అలాంటి బ్రాండ్ లను సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు. కియరా సొంతంగా కిమిరికా అనే కొత్త వెల్ నెస్ ప్రొడక్ట్ బ్రాండ్ మొదలు పెట్టింది.
కియరా పేరు వచ్చేలా కిమిరికా అని బ్రాండ్ పేరు పెట్టుకుంది. దీని గురించే ఊరించి ఊరించి చెప్పింది కియరా. ఆమె సొంతంగా వెల్ నెస్ బ్యూటీ ప్రొడక్ట్ బిజినెస్ పెట్టడం ఆమె ఫ్యాన్స్ కి హ్యాపీగానే అనిపించినా సిద్ధార్థ్ తో పెళ్లి వార్త చెబుతుందని అనుకున్న వారు నిరుత్సాహ పడ్డారు.
ఈ మధ్యనే దీపికా పదుకొనే కూడా సొంతంగా వెల్ నెస్ ప్రొడక్ట్ బ్రాండ్ మొదలు పెట్టింది. రెండేళ్లుగా వర్క్ చేసి రీసెంట్ గా తన బిజినెస్ ఎనౌన్స్ చేసింది దీపికా పదుకొనె. ఇక ఇప్పుడు ఆమె దారిలోనే కియరా కూడా కొత్త వెల్ నెస్ ప్రొడక్ట్ బ్రాండ్ ఏర్పాటు చేసుకుంది. కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అందుకే ఇలా సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టి అందులో కూడా సంపాదన మొదలు పెట్టారు బాలీవుడ్ భామలు. వీరే కాదు బాలీవుడ్ భామలు చాలామంది కూడా సొంత బిజినెస్ లతో దూసుకెళ్తున్నారు.