దేవుడు వరం ఇవ్వలేదని గణేష్ పార్టీ మార్చేసాడా?

ఇండస్ర్టీలో నిర్మాత బండ్ల గణేష్ ఆరాధ్య దైవం ఎవరంటే? టక్కున గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ గానే పవన్ నా దేవుడు అంటూ తనదైన శైలిలో మాట్లాడుతారు. బండ్ల గణేష్ ముందు పీకే ఉన్నారంటే? మైక్ పట్టుకుని ఓ రేంజ్ లో శివాలెత్తేస్తారు. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా బండ్ల గణేష్ మాత్రం ఆవేం పట్టించుకోరు.

తను అనుకున్నది ప్రతీది పీకే ముందు ఓపెన్ అయిపోవాల్సిందే. అంతటి అభిమానాన్ని పీకేపై గణేష్ చాటుకుంటారు. పవన్ కళ్యాణ్ మెప్పు కోసం చేసే భజన అని మీడియా లో కథనాలు వచ్చినా? వాటిని లైట్ తీసుకుని అభిమానం చాటుకోవడం అన్నది బండ్ల కే సాధ్యమైంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో ‘గబ్బర్ సింగ్’..’తీన్ మార్’ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

‘గబ్బర్ సింగ్’ భారీ విజయం సాధించినా…’తీన్ మార్’ మాత్రం డిజాస్టర్ అయింది. దీంతో బండ్ల తో మరో సినిమా చేస్తానని పీకే ప్రామిస్ చేసారు.

కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా వీలు పడలేదు. ఈగ్యాప్ లో గణేష్ చాలా మంది హీరోలతో సినిమాలు చేసారు. కానీ ‘గబ్బర్ సింగ్’ రేంజ్లో మరో సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో కొన్నా ళ్ల పాటు నిర్మాణానికి దూరంగా ఉన్నారు.

ఇక మూడేళ్లగా మళ్లీ పవన్ తో సినిమా చేయాలని వేదిక దొరికిన ప్రతీ సదర్భంలో దేవుడు ఇంకా వరం ఇవ్వలేదంటూ పీకే డేట్లు విషయాన్ని పరోక్షంగా గుర్తు చేసేవారు. ఈ నేపథ్యంలో తాజాగా గణేష్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘no time to live. life is most important for our family”.. ‘వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం. దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం. లేకపోతే టైం వేస్ట్ అని ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్ ని బట్టి పవన్ కళ్యాణ్ కోసం సమయాన్ని వృద్ధాం చేసుకోవడం అన్నది అవసరమైన పనిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఏదో రోజు పవన్ పిలిచి డేట్లు ఇస్తాడని వెయిట్ చేసారు. ఇక అది జరిగే పని కాదని అర్ధమైంది. అందుకే ఇలా ఓ ట్వీట్ తో కొత్త హీరోని సెట్ చేసుకునే ఆలోచనలో పడ్డట్లు రివీల్ చేసారు.