ఎయిర్ లైన్స్ చేస్తున్న పనుల వల్ల ఈమధ్య సెలబ్రిటీస్ కు కొంత అసౌకర్యం కలుగుతుంది. రీసెంట్ గా అనసూయ కూడా అలియన్స్ ఎయిర్ పై తన అసంతృప్తి ట్విట్టర్ వేదికగా బయట పెట్టింది. తమని పరుగులు పెట్టించి మరీ ఇబ్బంది పెట్టారని అనసూయ కామెంట్ చేసింది. ఇక లేటేస్ట్ గా రానా ఇండిగో ఎయిర్ లైన్స్ మీద తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన లగేజ్ మిస్ అయ్యిందంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ మీద ఫైర్ అయ్యాడు రానా.
రానాకి కలిగిన అసౌకర్యాన్ని గుర్తించిన ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ అతనికి క్షమాపణలు చెప్పింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. మీ లగేజ్ ని అతి త్వరలో మీకు అందచేస్తామంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ వారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే సెలబ్రిటీస్ కాబట్టి ఎయిర్ లైన్స్ సంస్థల మీద వారు ఇచ్చే కంప్లైంట్ పబ్లిక్ అటెన్షన్ ని సాధిస్తున్నాయి. ఇదే కంప్లైంట్ ఒక కామన్ మ్యాన్ ఇస్తే ఈ విధంగా ఆ ఎయిర్ లైన్స్ సంస్థల నుంచి రెస్పాన్స్ రావడం కష్టమని అంటున్నారు.
రానా లగేజ్ విషయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ వెంటనే స్పందించింది. లగేజ్ ని త్వరగానే ఆయనకు చేరేలా చూస్తున్నారట. రానా చేసిన ఈ ట్వీట్ కి చాలామంది నుంచి రెస్పాన్స్ వచ్చింది. రానా ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈమధ్య ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికుల మధ్య చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా పూజా హెగ్దేకి కూడా ఒక ఎయిర్ హోస్టెస్ నుంచి కొంత అసౌకర్యం కలిగింది. దాన్ని ఆమె తన ఇన్ స్టా పేజ్ లో పెట్టింది. సెలబ్రిటీస్ విషయంలోనే ఇంత నెగ్లెక్ట్ గా ఉంటే ఇక కామన్ మ్యాన్ విషయంలో ఎయిర్ లైన్స్ సంస్థలు ఎలా ఉంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. వేల కొద్దీ టికెట్ రేట్లు పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఇలా వారి నెగ్లిజన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.