పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఇప్పటికే ‘ఆది పురుష్’ పూర్తయి వీఎఫ్ ఎక్స్ వర్క్ దశలో వుండటంతో ప్రభాస్ మిగతా మూడు సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ కూడా వుంది. కోల్ మైన్స్ నేపథ్యంలో కేజీఎఫ్ తరహా థీమ్ తో ఈ మూవీని ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు.
హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని ‘కేజీఎఫ్’ మల్టీవర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీని కూడా ‘కేజీఎఫ్’ తరహాలో రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారని తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంటూ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు మధు స్వామి ఈశ్వరీ రావు శ్రియారెడ్డి నటిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ దాదాపుగా 85 శాతం పూర్తయింది. ఈ మూవీ సీక్వెల్ పై ఫైనల్ కట్ చూశాకే మేకర్స్ నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’ మూవీకి ఇదే పంథాని అనుసరించిన మేకర్స్ ‘సలార్’ విషయంలోనూ అదే ఫాలో కావాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నిర్మాత విజయ్ కిరగందూర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
రాబోయే ఐదేళ్లలో ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నామని ప్రకటించిన విజయ్ కిరగందూర్ పలు సీక్వెల్స్ గురించి ఆలోచిస్తున్నామని ఇందులో తాజా హిట్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ‘సలార్’ సీక్వెల్ వుంటుందా? ..ప్రస్తుతం సైమల్ టెనియస్ గా సీక్వెల్ షూటింగ్ ని చేస్తున్నామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ‘సలార్’ సీక్వెల్ ని అభిమానులని సర్ ప్రైజ్ చేస్తూ ప్రకటించే అవకాశం వుందనే వాదన వినిపిస్తోంది.