ఇండస్ట్రీలో కింద స్థాయి నుంచి కేవలం టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతారు ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గురించి చెబుతారు. ప్రయత్నిస్తే ఎప్పటికైనా మనం అనుకున్నది సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్ రవితేజ. ఒకప్పుడు ఆయన సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన ఆయన ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగాడు. చిరంజీవితో అన్నయ్య సినిమా చేసిన రవితేజ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించారు.
అన్నయ్య టైం లో అతను స్టార్ కాదు కానీ ఇప్పుడు రవితేజ మాస్ మహారాజ్. అందుకే అతని పాత్రకు కాస్త వెయిట్ ఉండేలా చేశారు. బాబీ కూడా రవితేజ డైరెక్టర్ కాబట్టి అతనికి స్పేస్ ఇచ్చాడు. అలా వాల్తేరు వీరయ్యలో చిరుతో పాటుగా రవితేజ కూడా ప్లేస్ అయ్యాడు.
అయితే మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి రవితేజ గురించి సరిగా మాట్లాడలేదు. రవితేజ ఫ్యాన్స్ ని ఇది అసంతృప్తి పరచింది. అయితే వెళ్తూ వెళ్తూనే సినిమాలో రవితేజ కూడా ఉన్నాడు కదా అని ఇంటికెళ్లి ట్వీట్ చేశారు చిరంజీవి.
సినిమాలో అందరి గురించి చెప్పి వీరయ్యకు అతి ముఖ్యుడు తమ్ముడు రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. తనతో సినిమా అనగానే అన్నయ్యతో సినిమా అని ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి షూటింగ్ అంతా రవితో చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
రవితేజ లేనిది వాల్తేరు వీరయ్య అసంపూర్ణం అని అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక ఈ ట్వీట్ కి వెంటనే రవితేజ కూడా స్పందించాడు. అన్నయ్య మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం.. మీ మాటలకు చాలా సంతోషం అంటూ లవ్ సింబల్ పెట్టారు.
సో మొత్తానికి ప్రెస్ మీట్ లో చెప్పకపోయినా రవితేజ వాల్తేరు వీరయ్యకు ఇచ్చిన కంట్రిబ్యూషన్ గురించి చిరు అలా ట్వీట్ లో చెప్పారు. రవితేజ కూడా ఆ ట్వీట్ కు రెస్పాండ్ అవుతూ మరోసారి చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు. మరి ఈ కాంబో తెర మీద సంక్రాంతికి మ్యాజిక్ చేస్తుందని ఫిక్స్ అవ్వొచ్చు. మెగా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పక్కా పూనకాలు లోడింగ్ అంటూ డైరెక్టర్ బాబీ మాత్రం అంచనాలు పెంచేస్తున్నాడు.