ఆ వీడియోను నా ఫ్యామిలీ చూశారంటూ హీరోయిన్ కన్నీరు..!

తమిళ బుల్లి తెర నుండి వెండి తెరపై అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రేష్మ పసుపులేటి. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన రేష్మ పసుపులేటి తక్కువ సమయంలోనే బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది.

బుల్లితెరపై యాంకర్ గా మరియు పలు రకాలుగా అలరించిన రేష్మ నటిగా తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. చిన్న పాత్రల్లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. హీరోయిన్ గా తమిళంలో మోస్ట్ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్స్ జాబితాలో చేరింది.

ఈ నటి గతంలో సుచీ లీక్స్ పేరుతో విడుదల అయిన అశ్లీల వీడియోల కారణంగా ఇబ్బంది పడింది. ఆ వీడియోల్లో రేష్మ వీడియో కూడా ఉందంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో రేష్మ వీడియో అంటూ ప్రచారం చేస్తూ షేర్ చేసిన ఆ వీడియోను నా చెల్లి మరియు కుటుంబ సభ్యులు చూశారు.

చెల్లి ఫోన్ చేసి నీ వీడియో అంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో వైరల్ అవుతుందని అన్నప్పుడు షాక్ అయ్యాను అంటూ తాజా ఇంటర్వ్యూలో రేష్మ కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఆ వీడియోను చూసి నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని బాధ కలిగింది.

అసలు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.. అప్పుడు ఇప్పుడు కూడా నేను ఎవరితో సన్నిహిత్యంగా లేను. ఎవరో కావాలని సుచి లీక్స్ పేరుతో మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేశారు. నా వీడియోలను క్రియేట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ రేష్మ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నాను అని.. తన గురించి ఫ్యామిలీకి మొత్తం తెలుసు కనుక వారు ఆ సమయంలో అర్థం చేసుకున్నారు అని రేష్మ పేర్కొంది. ఆ వీడియోలో ఉంది తాను కాదు అంటూ మరోసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా రేష్మ పసుపులేటి క్లారిటీ ఇచ్చింది.