‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ లో సమంత రూత్ ప్రభు భావోద్వేగం.. బుగ్గలపైకి జాలువారిన కన్నీళ్లను ఇంకా అభిమానులు మర్చిపోనేలేదు. ఇంతలోనే ఇదిగో తనలోని కొత్త కోణాన్ని ఎలివేట్ చేస్తూ సామ్ తనలోని విలక్షణతను చాటుకుంది.
సమంత మైయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి 2022 చివరిలో బయటపడింది. భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కెరీర్ జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతున్న క్రమంలో మహమ్మారీ తనను చుట్టుముట్టింది. ఆ తర్వాత మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చింది. ఇంతలోనే సామ్ ఇక తిరిగి తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రెడీ అవుతోందని కథనాలొచ్చాయి.
ఇటీవలే తన ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ కోసం బయటకు వెళ్లినప్పుడు వైట్ అండ్ వైట్ లో రాణీ హంసలా మెరిసిపోయింది. ఈవెంట్ లో ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఇంతలోనే సామ్ హాట్ ఫోటోషూట్ ఒకటి అంతర్జాలంలోకి దూసుకొచ్చింది. టూపీస్ లో ఆల్మోస్ట్ స్టన్నింగ్ లుక్ తో గుబులు పెంచింది. టాప్ ఇన్నర్ షార్ట్ తో కనిపించిన సమంత తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. అలా రెడ్ లిప్ స్టిక్ ని అద్దుకుంటూ సమ్మోహన రూపంతో కవ్వించింది. ఇటీవలి కాలంలో సామ్ నుంచి దూసుకొచ్చిన పదునైన బాణమిది! అని కొందరు కితాబిచ్చేస్తుంటే..
గ్యాప్ తర్వాత సామ్ గురి చూసి విసిరిన బాణమిది అంటూ కొందరు ప్రశంసలు కురిపించారు. అల్ట్రా గ్లామరస్ సామ్ అల్లాడించిందిగా అంటూ కొందరు కితాబివ్వగా.. సమంత స్టన్నింగ్ హాట్ లుక్ వ్వావ్ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాల్లో జెట్ స్పీడ్ తో ఈ కొత్త లుక్ వైరల్ అయిపోతోంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే సమంత తదుపరి దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో నటించనుంది.