మహేశ్ బాబు నమ్రత పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సితార గౌతమ్ లు ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే. కానీ వీరిద్దరిలో మాత్రం సితార కాస్త ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పడూ తన డ్యాన్స్ లు ఫోటోలతో నెటిజన్లకు దగ్గరగా ఉంటుంది. ఇక వీరిద్దరి అకౌంట్లు నమ్రత ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. అయితే సితార చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. మిస్ యూ అన్నయ్య.. కమ్ బ్యాక్ సూన్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఎక్కడికి వెళ్లాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి గౌతమ్ మొదటి సారి కల్చరల్ టూర్ కు వెళ్లాడు. స్కూల్ నుంచి మొదటి సారిగా సొంతంగా ప్రయాణం చేస్తూ వెళ్లాడు. ఇక ఇటీవల తన కుమారుడిని ఉద్దేశిస్తూ నమ్రత కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కల్చరల్ ట్రిప్‌లో భాగంగా గౌతమ్ మొదటిసారి.. సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది అంటూ పోస్ట్ చేసింది.
”రోజంతా శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి.. మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. గూడును వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు సంతోషాలు సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ప్రయాణం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా” అంటూ భావోద్వేగంతో నమ్రత ఇన్ స్టా లో రాసుకొచ్చింది. #Teens #Independence అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ఆమె ఈ పోస్టుకు జత చేసింది. అలాగే సహ విద్యార్థులతో కలిసి గౌతమ్ దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
ఇక గౌతమ్ మొదటి సారిగా మహేశ్ వన్ నేనొక్కడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నతనంలో మహేశ్ పాత్రను గౌతమ్ పోషించాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా… మహేశ్ గౌతమ్ యాక్టింగ్ లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక మహేశ్ బాబుకు గౌతమ్ సితారలు ఎంత ఇష్టమో చెప్పనక్కరలేదు. గౌతమ్ ను సితార డామినేట్ చేస్తుందనే మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి.