సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దశాబ్దాలు గడుస్తున్నా రజనీ క్రేజ్ మరింతగా పెరుగుతోందే కానీ ఎక్కడా తగ్గడం లేదు. తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. గత కొంత కాలంగా రజనీ తన స్టార్ డమ్ స్థాయి బ్లాక్ బస్టర్ లని దక్కించుకోలేకపోతున్నా కానీ ఆయన మార్కెట్ స్థాయిలో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. డిఫరెంట్ మేనరిజమ్స్ ఐకానిక్ స్టైల్స్ తో ఆశేష అభిఆమాన గనాన్ని సొంతం చేసుకున్న రజనీ వెండితెరపై కనిపిస్తే ఆ మెరుపులే వేరు.
ఆ స్టైల్.. ప్రేక్షకుల్లో ఆయనకుండే క్రేజ్ ని వెలకట్టలేం.అందుకే రజనీ తో సినిమాలు చేయడానికి యంగ్ డైరెక్టర్ల నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు పోటీపడుతుంటారు.ఒక్క ఛాన్స్ వస్తే చాలాని ఆశ పడుతుంటారు. రజనీ కూడా తనదైన మార్కు స్టైల్స్ తో వెండితెరపై హంగామా చేస్తాడు..
దీంతో తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా కాసులు వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తుంటాయి. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న రజనీ గత కొన్ని దశాబ్దాలుగా బాక్సాఫీస్ ని ఏలేస్తున్నారు.
తన క్రేజ్ కి తగ్గట్టుగా రికార్డు స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ ‘జైలర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా దళపతి విజయ్ తో ‘బీస్ట్’ మూవీని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రజనీకి జోడీగా తమన్నా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో రమ్యకృష్ణ కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు.
కీలక అతిథి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనిపించనుండగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీ సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీలో నటిస్తూనే రజనీ తన కుమార్తె ఐశ్వర్య రూపొందిస్తున్న ‘లాల్ సలామ్’లో అతిథి పాత్ర లో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీలో విష్ణు విశాల్ విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.ఈ మూవీ కోసం కేవలం ఏడు రోజులు షూటింగ్ చేసిన రజనీ కాంత్ ఇందు కు గానూ 25 కోట్లు పారితోషికం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ స్థాయిలో పారితోషికం అందుకున్న ఏకైక ఇండియన్ స్టార్ గా రజనీ రికార్డు సాధించినట్టే. ఇక ‘జైలర్’ మూవీ కోసం రజనీ ఏకంగా 140 కోట్లు తీసుకున్నాడని ఇది దక్షిణాది హీరోల్లో రికార్డుగా చెబుతున్నారు.