టాలీవుడ్ కి నిత్యం కొత్త భామలు దిగుమతి అవుతూనే ఉంటారు. ఎందరో వస్తుంటారు..వెళ్తుంటారు. వాళ్లలో కొంత మందే నిలబడి స్టార్ హీరోయిన్లగా ఎదుగుతారు. హీరోయిన్ల మధ్య ఇప్పుడు గట్టిపోటీనే కనిపిస్తుంది. కొత్త భామలు ఎంత మంది వస్తున్నా? సీనియర్ నాయికల్ని తట్టుకుని నిలబటం ఇబ్బందికరంగానే ఉంది. తాజాగా ఒకే నెలలో ముగ్గురు అందమైన భామలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.
ఆ మూడు మీడియం బడ్జెట్ సినిమాలు కావడం సహా…బ్యూటీ వాళ్లపై ఫోకస్ చేసేలా చేసింది. కానీ కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చినా వాళ్ల డెబ్యూలు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఈ నెల 4వ తేదీన విడుదలైన ‘బుట్టబొమ్మ’ సినిమాతో అనిఖ సురేంద్రన్ పరిచయమైంది. యాక్టింగ్ పరంగా నటిగా పాస్ అయింది. కానీ సినిమా వైఫల్యంతో అమ్మడి ఎఫెర్ట్ అందా వృద్ధా ప్రయత్నంలా కనిపిస్తుంది.
అందం..అభినయంతో కుర్రాళ్లని ఆకట్టుకుంది. సినిమా హిట్ అయితే సురేంద్రన్ కి అన్ని వైపులా పాజిటివ్ గా ఉండేది. మరి తాజా పరిస్థితి నేపథ్యంలో కెరీర్ లో ఎలా ముందుకు సాగుతుందన్నది చూడాలి. ఇదే నెల 10వ తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాతో అషికా రంగనాద్ హీరోయిన్ గాపరిచయ మైంది.
రిలీజ్ కి ముందు ‘అమిగోస్’ ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. కళ్యాణ్ రామ్ మళ్లీ గట్టిగానే కొట్టేట్లు ఫోకస్ అయ్యారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. బ్యూటీ గ్లామర్ లుక్ తో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రొమాంటిక్ పెర్పార్మెన్స్ అమ్మడికి ఓ ఐడెంటిటీ తీసుకొచ్చింది. మరీ ఈ భామ భవిష్యత్ ని ఎలా ప్లాన్ చేసుకుందో? తాజా పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తుందన్నది చూడాలి.
ఇక ఈ నెల 18న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాతో గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమైంది. చబ్బీ లుక్ లో ఆకట్టుకుంది. బ్యూటీలో కొన్ని ఛార్మీ పొలికలున్నాయి. దీంతో గౌరీ కిషన్ టాలీవుడ్ కి వెల్ నోన్ అమ్మాయిలా ఫోకస్ అయింది. మరి బ్యూటీ చేతిలో కొత్త అవకాశాలు ఏవైనా ఉన్నాయా? అన్నది చూడాలి. ఆ రకంగా ముగ్గురు బ్యూటీలకి 2023 ఫిబ్రవరి ఓ పిడ నెలగానే చెప్పాలి.