బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెండి తెర సాహసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కమర్శియల్ చిత్రాలతో పాటు కత్తి పట్టి యుద్దాలు చేయగల నటి. యాక్షన్ చిత్రాల్లో ప్రత్యర్ధులపై అదిరిపోయే పంచ్ లు విసరగలదు. బయోపిక్ ల్లో సైతం నటించిన తనదైన ముద్ర వేయగలదు. నటిగానే కాదు దర్శకురాలిగా.. నిర్మాతగానూ కంగన స్థానం ప్రత్యేకమైనది. అవసరమైతే తానే వన్ ఉమెన్ ఆర్మీగానూ సినిమా కోసం పనిచేయగలదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది. ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘చంద్రముఖి-2’ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రముఖి పాత్ర కోసం ఏరికోరి మరీ కంగన ని ఎంపిక చేసారు.
సౌత్ లో చాలా మంది హీరోయిన్లను పరిశీలించి చివరిగా కంగనని తీసుకున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండవ భాగానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
రజనీకాంత్ పాత్రలో రాఘవలారెన్స్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్ కంగనారనౌత్ వ్యానిటీ వాన్ లో మేకప్ వేసుకుంటూ రెడీ అవుతోన్న కొన్ని ఫోటోల్ని పంచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా కంగన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ లీక్ ఒకటి బయటకొచ్చింది. ఇందులో కంగర రోల్ లో రెండు రకాల షెడ్స్ ఉంటాయిట.
ఒకటి బాల్యదశలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికగా కనిపించనుదిట. ఆ పాత్రలో ఆమె స్వయంగా నటిస్తుందిట. ఇతర పిల్లలో ఆ పాత్ర చేయించడం ఇష్టం లేక తానే పోషిస్తానని చెప్పిందిట. అందుకోసం కొంత బరువు సహా రూప లావణ్యంలో మార్పులు చేస్తుందని తెలుస్తోంది.
ఆ అత్యాచర ఘటన సన్నివేశం చంద్రముఖికి ప్రీక్వెల్ రూపంలోకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. చంద్రముఖిలో జ్యోతిక బాల్యాన్ని కొంత వరకూ హైలైట్ చేసారు. అయితే ఇప్పుడా పాత్రని మరింత బలంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రముఖిగా మారడానికి ఇంకా బలంగా ప్రేరేపించిన కారణాలు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పెరిగి పెద్దాయ్యాక చంద్రముఖిగా కంగన నట విశ్వరూపం చూపిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.