పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలు కూడా చూస్తున్నారు. రాజకీయ ప్రయాణం ఉన్న సమయంలో సినిమా షూటింగ్ లకి గ్యాప్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేయడానికి ప్రత్యేకంగా కాల్ షీట్స్ వైజ్ గా డేట్స్ ని పవన్ కళ్యాణ్ కేటాయించారు.
ముందుగా వినోదాయ సీతమ్ రీమేక్ కోసం 25 రోజుల కాల్ షీట్స్ ని పవన్ కళ్యాణ్ కేటాయించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం విశేషం. ముందుగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరో 30 రోజుల షూటింగ్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉందని నిర్మాత చెప్పారు. ఇక ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు షూటింగ్ కూడా క్రిష్ ప్లాన్ చేసుకుంతున్నారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తారు. ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
వచ్చే నెల నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా అందించాలని అనుకుంటున్నట్లు గతంలో హరీష్ శంకర్ తెలిపారు. మరి ఆ సమయానికి ఈ మూవీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఉంటే షూటింగ్ కాస్తా ఆలస్యం జరిగిన పరవాలేదనే మాట వినిపిస్తుంది.
మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి లోపు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తాయనే మాట ఇప్పుడు టాలీవుడ్ గట్టిగా వినిపిస్తుంది. అంటే మొదటి ఆరు నెలల్లోనే సినిమా షూటింగ్ లు అన్ని కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.