అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి.. ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ ఏదైనా మ్యాజిక్ చేసేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏజెంట్ విడుదల అవ్వడమే ఆలస్యం కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అఖిల్ లుక్ నుండి మొదలుకుని ప్రతి విషయంలో కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సినిమా గురించి వస్తున్న ట్రోల్స్ పై అఖిల్ మదర్ అమల అక్కినేని స్పందించారు.
ఆమె ఏజెంట్ ట్రోల్స్ గురించి స్పందిస్తూ… ట్రోలింగ్ అనేది కొందరి అభద్రత భావం తాలూకు ఫీలింగ్ గా నేను భావిస్తాను. ఆ ట్రోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాను చూశాను. సినిమా చూస్తున్నంత సమయం కూడా ఆస్వాదించాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఓపెన్ మైండ్ తో చూస్తే తప్పకుండా నచ్చుతుంది.
నేను వెళ్లిన థియేటర్ లో 50 శాతం మంది ప్రేక్షకులు ఉన్నారు. అందులో అమ్మలు.. అమ్మమ్మలు.. నానమ్మలు.. కొడుకులు.. భర్తలు ఇలా చాలా మంది ఉన్నారు. సినిమాలోని మంచి సన్నివేశాలు వస్తున్న సమయంలో వారు పెద్దగా అరవడం.. ఉత్సాహంతో చప్పట్లు కొట్టడం నేను చూశాను అంటూ పేర్కొంది. ముందు రాబోతున్న సినిమా మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నట్లుగా అఖిల్ గురించి కామెంట్స్ చేసింది.