బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 సినిమా చేస్తున్నారు. 2012 లో ఏక్ థా టైగర్ సినిమా చేసిన సల్మాన్ ఖాన్ ఆ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ చేశారు. ఏక్ థా టైగర్ సినిమాను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత అంటే 2017 లో టైగర్ జిందా హై సినిమా చేశారు.
ఈ సినిమాను అలి అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేశారు. ఇక లేటెస్ట్ గా టైగర్ 3 కూడా షురూ చేశాడు సల్మాన్ భాయ్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న టైగర్ 3 సినిమాను మనీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. టైగర్ 1 2 సినిమాల్లో కూడా సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.
టైగర్ 3లో కూడా ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా కోసం ఒక భారీ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్నారట. 10 నిమిషాలు ఫైట్ సీన్ కోసం ఏకంగా 35 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారని టాక్. సినిమాలో ఈ ఫైట్ సీన్ హైలెట్ గా ఉంటుందని ప్రతి ఒక్కరు ఈ ఫైట్ సీన్ కోసం సినిమాను రిపీటెడ్ గా చూస్తారని.. డిస్కషన్స్ కూడా చేస్తారని అంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీన్స్ చేస్తున్నారట.
ఈ ఫైట్ సీక్వెన్స్ రెండు భాగాలుగా వస్తుందట. మొదట ఐదు నిమిషాలు వచ్చి మళ్లీ దానికి కొనసాగింపుగా మరో నాలుగు సినిమాలు పాట్ ఉంటుందట. ఈ ఫైట్ సీన్ వచ్చే టైం లో థియేటర్ దద్దరిల్లిపోవడం పక్కా అని అంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ ఫైట్ సీన్ కోసం చాలా వర్క్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టైగర్ 3 సల్మాన్ ఫ్యాన్స్ కే కాదు బాలీవుడ్ ఆడియన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
టైగర్ 3 సినిమా లో షారుఖ్ ఖాన్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇటీవల షారుఖ్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు టైగర్ 3 లో కూడా షారుఖ్ కనిపించనున్నారు. రీసెంట్ గా కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు.