అక్కినేని ఫ్యామిలీ యువ హీరో అఖిల్ ఏజెంట్ తో మరోసారి ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. ఏజెంట్ తో తన మాస్ యాంగిల్ చూపించి కమర్షియల్ గా కూడా సత్తా చాటుతాడని అనుకోగా అది కాస్త రివర్స్ కొట్టేసింది. అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.
కానీ సినిమా వర్క్ అవుట్ కాలేదు. అఖిల్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. ఒకటి రెండు కాదు ఈసారి మూడు సినిమాల ను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లేలా మాస్టర్ ప్లాన్ వేశాడట అఖిల్. హీరో అన్న తర్వాత హిట్లు ప్లాపులు చాలా కామన్ కాబట్టి ఫ్లాప్ వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు.
ఏజెంట్ తో కొద్దిగా డీలా పడ్డ అఖిల్ సినిమా కు తను పడిన కష్టాన్ని ఆడియన్స్ గుర్తించారు. సో ఇక మీదట కథల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే క్రమంలో అఖిల్ ముగ్గురు డైరెక్టర్స్ కి ఓకే చెప్పినట్టు టాక్. ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అంటే వంశీ పైడిపల్లి శ్రీకాంత్ ఓదెల శివ నిర్వాణ అని తెలుస్తుంది.
వంశీ పైడిపల్లి ఆల్రెడీ స్టార్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నాగార్జున తో ఊపిరి సినిమా కూడా చేశాడు. మహేష్ దళపతి విజయ్ లతో సినిమాలు చేశాడు. సో అఖిల్ వంశీ పైడిపల్లి మంచి కాంబో అని చెప్పొచ్చు.
ఇక దసరా తో తొలి సినిమానే సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల చాయిస్ కూడా బాగుందని చెప్పొచ్చు. అఖిల్ శ్రీకాంత్ ఓదెల ఈ కాంబో సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ లిస్ట్ లో శివ నిర్వాణ కూడా ఉన్నాడు. నిన్ను కోరి నుంచి లేటెస్ట్ గా విజయ్ తో ఖుషి సినిమా చేస్తున్నాడు శివ నిర్వాణ. ఆల్రెడీ ఖుషి తర్వాత నాగ చైతన్యతో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ అఖిల్ కోసం కూడా శివ నిర్వాణ ఒక కథ రెడీ చేశాడట.
ఈ మూడు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లి పర్ఫెక్ట్ టైమింగ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు అఖిల్. మరో హిట్ పడే వరకు అఖిల్ కు నాగార్జున సపోర్ట్ గా ఉండనున్నారు. స్టోరీ జడ్జ్ మెంట్ విషయంలో అఖిల్ కి ఇంకా ఆ పరిణితి రాలేదని చెప్పొచ్చు. నాగార్జున తో కలిసి ఈ మూడు ప్రాజెక్ట్ లను ఫిక్స్ చేసుకున్నాడట. అంతేకాదు ఈ సినిమాల్లో ఏదో ఒక దానిలో నాగార్జున కూడా కెమియో ఉంటుందని టాక్.