సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా దసరా సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర మరోసారి ఆమెపై ఉన్న విమర్శలకి ఫుల్ స్టాప్ పడేలా చేసింది. ఇక తమిళంలో చేసిన సానికాయుధం మూవీ అయితే పూర్తి డీగ్లామర్ రోల్ లో నట విశ్వరూపం చూపించింది.
ఈ కారణంగానే కీర్తి సురేష్ అని అందరూ మహానటితో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో చెల్లెలు పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఇక తమిళంలో జయం రవితో సెరిన్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది.
అలాగే రివాల్వర్ రీటా అనే అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమా కూడా సెట్స్ పైన ఉంది. అలాగే మలయాళంలో రెండు సినిమాలు కమిట్ అయ్యి ఉంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై తెగ వార్తలు వస్తున్నాయి. ఆమెకి ఒక బిజినెస్ మెన్ తో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసినట్లు ముందుగా ప్రచారం నడిచింది. దానికి కీర్తి సురేష్ తల్లి క్లారిటీ ఇచ్చి ఖండించింది.
అయితే తాజాగా ఆమె ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. అందులో ఉన్న వ్యక్తి కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే వాటిపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. అతను తన బెస్ట్ ఫ్రెండ్ ఫర్హాన్ అని తెలిపింది. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇదిలా కీర్తి సురేష్ లవర్ అంటూ సాగిన వార్తలపై ఆమె తండ్రి మలయాళీ నిర్మాత సురేష్ స్పందించారు. తమ కూతురు కీర్తి సురేష్ ఎవరితో లవ్ లో లేదని ఆమె బర్త్ డే రోజు ఫ్రెండ్ ఫర్హాన్ తో తీసుకున్న ఫోటోలపై అలా తప్పుడు ప్రచారం చేసారంటూ పేర్కొన్నారు. ఆ అబ్బాయి తమకి భాగా తెలుసని క్లారిటీ ఇచ్చారు. ఇక వేళ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మేమే తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తల కారణంగా తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందని అన్నారు.