మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట నిశ్చితార్థం నేటి సాయంత్రం కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ప్రయివేట్ కార్యక్రమంగా సాగింది. ఈ జంట తమ పరిశ్రమ స్నేహితుల కు షేర్ చేసిన డిజిటల్ ఆహ్వానం ఇటీవల ట్విట్టర్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఆహ్వానం లో వరుణ్ – లావణ్యల ఫోటో ఉంది . అందులో “రెండు హృదయాలు.. ఒకే ప్రేమ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కి అభినందనలు. జీవిత కాలం కలిసి సంతోషం గా ఉండాల ని కోరుకుంటున్నాను” అని రాసి ఉంది. ఆహ్వానం లో నిశ్చితార్థం తేదీ కూడా వెల్లడైంది.
ఎట్టకేల కు ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. వేదిక వద్ద నుంచి కొన్ని అనధికారిక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ విలాసవంతమైన నివాసం లో ఈ జంట నిశ్చితార్థ ప్రమాణాలు నేటిసాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య పూర్తయ్యాయి. ఈ జంట అంగుళీకాల ను మార్చుకున్నారు. ఈ ప్రైవేట్ వేడుక కు మెగా అల్లు కుటుంబాలు విచ్చేసాయి.
ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ ఇంటి కి వచ్చిన వీడియో వైరల్ అయింది. అంతకుముందే వరుణ్ ఇంటికి విచ్చేసిన లావణ్య త్రిపాఠి ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వేడుక కు రామ్ చరణ్- ఉపాసన కామినేని జంటగా వచ్చిన ఫోటోలు బయటకు వచ్చాయి. రామ్ చరణ్ సింపుల్ గా బ్లూ డెనిమ్ షర్ట్ లో కనిపించగా.. ఉపాసన హెవీ చోకర్ నెక్ పీస్ గౌను తో ప్రత్యక్షమయ్యారు. అలాగే ఈ వేడుక కు మెగా బాస్ చిరంజీవి కూడా వచ్చారు. వరుణ్ – లావణ్య జంట కు మెగా బాస్ లు ఇరువురూ తమ ఆశీస్సుల ను అందించారు.
వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో ‘మిస్టర్’ సెట్స్ లో కలుసుకున్నారు. షూటింగ్ సమయం లో ఇరువురి నడుమా బలమైన స్నేహబంధాన్ని కొనసాగించారని కథనాలొచ్చాయి. ఈ జంట రెండవ చిత్రం అంతరిక్షం 9000 KMPH చిత్రీకరణ సమయం లో డేటింగ్ చేస్తున్నారనే వార్త వెలుగు లోకి వచ్చింది. చివరికి వరుణ్ తేజ్-లావణ్య కలిసి బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు.
జంటగా పార్టీలు కార్యక్రమాల కు హాజరైన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. 2020లో వరుణ్ తేజ్ సోదరి నటి నిహారిక కొణిదెల వివాహాని కి లావణ్య త్రిపాఠి హాజరు కావడం వారి బంధంపై ఊహాగానాల కు మరింత ఆజ్యం పోసింది. ఎట్టకేల కు నిశ్చితార్థం పూర్తయింది. ముచ్చటైన జంట పెళ్లి తేదీ వెల్లడి కావాల్సి ఉంది.