మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కెరీర్ ఆరంభం లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా హ్యాపీ డేస్ నుండి ఈ అమ్మడి యొక్క కెరీర్ పూర్తిగా మారి పోయింది. వరుస గా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోని దాదాపు అందరు హీరో లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే.
కేవలం తెలుగు సినిమా ల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ మధ్య కాలంలో యంగ్ స్టార్ హీరోలు తమన్నా వైపు చూడటం లేదు. అయినా కూడా తగ్గకుండా సీనియర్ హీరో లతో కూడా నటిస్తూ బిజీ గా ఉంది. తెలుగు లో భోళా శంకర్ సినిమా లో నటించిన ఈ అమ్మడు తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ కు జోడీ గా జైలర్ సినిమా లో నటించిన విషయం తెల్సిందే.
ఇటీవలే రజినీకాంత్ జైలర్ షూటింగ్ ను మిల్కీ బ్యూటీ పూర్తి చేసుకుంది. సాధారణంగా రజినీకాంత్ తన సినిమా లో నటించిన వారికి రాఘవేంద్ర స్వామి విగ్రహంను బహుమానంగా ఇస్తాడు. తమన్నా కు రాఘవేంద్ర స్వామి విగ్రహం తో పాటు ఒక ఆధ్యాత్మిక పుస్తకం ను కూడా అందించడం జరిగిందట.
తాజాగా సోషల్ మీడియా ద్వారా మిల్కీ బ్యూటీ తమన్నా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. రజినీకాంత్ సర్ తన కు ఇచ్చిన ఒక పుస్తకం అత్యంత ఉపయోగదాయం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ పుస్తకం అందుకున్నందుకు అదృష్టవంతురాలి గా భావిస్తున్నట్లుగా కూడా పేర్కొంది.
మొత్తానికి రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ చేతుల మీదు గా అరుదైన గిఫ్ట్ ను అందుకున్న మిల్కీ బ్యూటీ చాలా లక్కీ అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు నటించిన భోళా శంకర్ మరియు జైలర్ సినిమాలు ఒక్క రోజు తేడా తో ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కాకుండా హిందీ మరియు మలయాళం లో ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.