ఆటోరిక్షాలో హీరోయిన్ జర్నీ…ఇంట్లో కార్లు లేవా?

ఇప్పుడేదైనా రొటీన్ కి భిన్నంగా చేయాలి. అప్పుడే మైలేజ్ వచ్చేది. నలుగురుకి తెలిసేది. పోటీ ప్రపంచంలో ఎంతో ఇన్నోవేటివ్ గా వెళ్తే! అంతకంతకు వెలుగులోకి వస్తాం. రోటీన్ గా చేస్తే ఎవరు చూస్తారు? అందుకే దానికి భిన్నంగా వెళ్తేనే జనాల్లోకి వెళ్లేది అనేది కొందరి లెక్క.

సరిగ్గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ ఇప్పుడు అలాంటి పనొకటి చేసింది. ఇంట్లో కోట్ల రూపాయల ఖరీదైన కార్లు ఉన్నా! అమ్మడు ఆటోరిక్షాలో జిమ్ కి వెళ్లింది. మూతికి మాస్క్ ధరించి సాధారణ దుస్తుల్లో అభిమానులకు హాయ్ చెబుతూ ఇలా జుహూ ఏరియాలో కనిపించింది.

ఆటోలో వచ్చానని సిగ్గు..మొహమాటం లాంటివి పడలేదు. ఈ రకంగా తనలో డౌన్ టు ఎర్త్ క్వాలిటీని బయట పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు ఏంటి ఇలా ఆటోలో వచ్చింది? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో కార్లు అన్నీ ఏమయ్యాయి? లేక కావాలనే ఆటోలో వచ్చిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బహుశా శ్రద్దా కపూర్ ఇలా ఆటో ఎక్కడం ఇదే తొలిసారేమో. ఆటో ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందంటూ! అడుగుతున్నారు. హీరోయిన్లే కాదు అప్పుడప్పుడు స్టార్ హీరోలు సైతం ఇలా ఆర్టీసీ బస్సులు..ఆటో జర్నీలు మప్టీలో చేస్తుంటారు.

ఎవరూ గుర్తు పట్టకుండా ముఖాన్ని మాస్కులతో..స్కాప్ లతో కవర్ చేసి సాధారణ జనాల్లో కలిసి ప్రయాణిస్తుంటారు. బాలీవుడ్ హీరోలు ఇలాంటి ఫీట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ కూడా ఇలాగే ఎవరూ గుర్తుపట్టకుండా బైక్ పై మూసాపేట థియేటర్ కి సినిమాకెళ్లి వచ్చారు. ఆ సమయంలో ముసుగు గాలికి ఎగిరిపోవడంతో వర్మ అని గుర్తించి అతని వైపు పరుగులు తీయబోయారు.

ఆ తర్వాత సాయి పల్లవి కూడా స్కాప్ ధరించి ఓ మాల్ లో సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూసొచ్చింది. అంతకు ముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కూడా గుర్తు పట్టకుండా ముంబై వీధుల్లో షికార్లు చేసిన సందర్భాలున్నాయి. అలాగే అమీర్ ఖాన్ కి కూడా ఇలాంటి ఆస్వాదన అంటే ఎంతో ఇష్టం.