ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలు వివాదాలు వస్తున్నాయి. శ్రీరాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే వీరి పాత్రల ఆహార్యం డైలాగులు విజువల్స్ వంటి పలు అంశాలపై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని తనకు నచ్చినట్లు వక్రీకరించి తెరకెక్కించారని మండి పడుతున్నారు.
ఇదిలా ఉంటే… ఈ సినిమా ప్రభావం వచ్చే రామాయణ సినిమాలపై పడే అవకాశం ఉంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ రామాయణాన్ని తెరకెక్కించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈయన సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా అలియా భట్ ను అనుకున్నారు. అయితే ఇప్పటికే ఆది పురుష్ సినిమా తీవ్ర ట్రోలింగ్ కు గురవుతోంది.
ఇప్పుడు మరో రామాయణంపై ఆ సినిమా ప్రభావం పడుతుందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే రాముడిగా రణబీర్ కపూర్ అనర్హుడు అంటూ సోషల్ మీడియాలో హిందూ వాదులు పెడుతున్నారు. దానికి కారణం.. రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తాను బీఫ్ తింటాను అని చెప్పడం… ఇలా బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రలో నటించేందుకు అనర్హుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు సీతగా అలీయా భట్ నటించొద్దని అంటున్నారు. దానికి కారణం ఇంతకు ముందు అలియా భట్… గంగూబాయి కతియావాడిలో వేశ్య పాత్ర పోషించింది. ఇలాంటి పాత్రలో నటించిన ఈమెకు సీతగా నటించే అర్హత లేదని హిందూ వాదులు వాపోతున్నారు. అయితే వారు నటులు.. ఏ పాత్రలోనైనా నటించే స్వేచ్ఛ వారికి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు.
అయితే ప్రాజెక్టు విషయానికి వస్తే… ఇందులో రాముడిగా రణ్ బీర్ సీతగా ఆలియా రావణుడిగా యష్ కన్పామ్ అంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత మధు మంతెనలతో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని సమాచారం. అయితే ఆదిపురుష్ ప్రభావం వచ్చే పౌరణిక సినిమాలపై పడనుందని అర్థం అవుతుంది. చూడాలి ఇక.