గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా దేవర. ఈ మూవీ షూటింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధం అవుతోన్న ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా ఈ చిత్రం లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ కథ మొత్తం నడునడుస్తుందని టాక్. దసరా మూవీ లో విలన్ గా నటించిన మలయాళీ యాక్టర్ షైన్ టామ్ చాకో కూడా దేవర లో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో కొరటాల కంప్లీట్ చేస్తున్నారు.
ఓ వైపు షూటింగ్ పూర్తి చేస్తూనే మరో వైపు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబందించిన సూపర్ విజన్ కూడా షూటింగ్ లోనే జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. పెర్ఫెక్ట్ ప్లాన్ తో కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే దేవర తర్వాత తారక్ హిందీ లో వార్ 2 మూవీ లో నటించాల్సి ఉంది. తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
వార్ 2 కోసం ఇప్పటికే డిసెంబర్ లో తారక్ కాల్ షీట్స్ కేటాయించడం జరిగిందంట. ఏకంగా మూడు నెలల పాటు ఆ చిత్రం కోసం తారక్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో దేవర సినిమా కి గ్యాప్ తీసుకోకుండా ఫినిష్ చేస్తున్నారు. సెప్టెంబర్ ఆఖరుకి 90 శాతం షూటింగ్ కంప్లీట్ అవుతుందంట.
నవంబర్ ఆఖరు కి షూటింగ్ కంప్లీట్ కావడం తో పాటు ప్యాచ్ వర్క్ ని కూడా ఫినిష్ చేయనున్నట్లు సమాచారం. నవంబర్ లో దేవర షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయాల ని కొరటాల సైతం ఫిక్స్ అయ్యారంట. అందుకే ముందుగా పెర్ఫెక్ట్ స్టొరీబోర్డు షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ వేసుకొని రంగం లోకి దిగారని తెలుస్తోంది.