తమిళ అమ్మాయే అయినా మలయాళ సినిమా ప్రేమమ్ తో పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాతో తెలుగు తెరకు పరిచయమై అప్పటి నుంచి ప్రతి తమిళ అమ్మాయే అయినా మలయాళ సినిమా ప్రేమమ్ తో పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాతో తెలుగు తెరకు పరిచయమై అప్పటి నుంచి ప్రతి సినిమా తో తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. సాయి పల్లవి సినిమా లో ఉంటే సినిమా పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. కేవలం అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ సాయి పల్లవి తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంది. చివరగా రానా తో విరాటపర్వం సినిమా చేసిన సాయి పల్లవి గార్గి సినిమా తో కూడా ప్రేక్షకుల ను అలరించింది.
గార్గి తర్వాత సినిమాల విషయంలో టైం తీసుకోగా సాయి పల్లవి ఇక సినిమాల ను ఆపేస్తుందని వార్తలు రాసుకొచ్చారు. కానీ సరైన పాత్రలు రాకపోవడం వల్లే సాయి పల్లవి సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. ఫైనల్ గా సాయి పల్లవి తమిళ హీరో శివ కార్తికేయన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. శివ కార్తికేయన్ సినిమాలన్నీ తెలుగు లో కూడా డబ్ అవుతున్నాయి కాబట్టి సాయి పల్లవి నటిస్తుంది కాబట్టి ఈ సినిమా కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది.
సినిమాల సంగతి అలా ఉంచితే ఈమధ్య సోషల్ మీడియా లో కూడా సాయి పల్లవి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అయితే లేటెస్ట్ గా అమ్మడు నేచర్ ని ఆస్వాదిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు.. పూలు ఇలా నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి. అంతేకాదు ఈ ఫోటోలు తన సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉందని రాసుకొచ్చింది. సాయి పల్లవి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.
అందరు గ్లామర్ ట్రీట్ తో ఫోటో షూట్ చేస్తే నేచర్ అందాలతో సాయి పల్లవి ఫోటోలు షేర్ చేసి సర్ ప్రైజ్ చేసింది. తెలుగు లో ఆమె తర్వాత సినిమా కోసం ఇక్కడ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగు లో లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఇక్కడ మాత్రం పాత్ర ప్రాధాన్యతను బట్టే సినిమాలు చేయాలని అనుకుంటుంది.
నేచురల్ బ్యూటీ గా తన సహజ నటన తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన సాయి పల్లవి తనకు ఇక్కడ ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి అందుకు తగిన సినిమాలనే చేయాల ని అనుకుంటుంది. తెలుగు లో సరైన కథలు సెట్ అవక సినిమాలు చేయట్లేదని తెలుస్తుండగా సాయి పల్లవిని మెప్పించే కథలు రాసేందుకు రైటర్స్ ప్రయత్నిస్తున్నారు.