మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సుదీర్ఘ కాల ప్రియురాలు లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. గత నెలలో వీరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు వైపుల ఫ్యామిలీ మెంబర్స్ హాజరు అయ్యారు. చిరంజీవితో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వివాహ నిశ్చితార్థం కు హాజరు అవ్వడం జరిగింది.
ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి తేదీ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కానీ పెళ్లి జరిగేది ఇటలీలో అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లికి కూడా పెద్ద ఎత్తున బంధుమిత్రులు హాజరు అయ్యే అవకాశం లేదట.
ఇరు వైపుల కుటుంబ సభ్యులు.. అత్యంత ఆప్తులు అయిన మిత్రులను ఇటలీ లో జరగబోతున్న పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఇండస్ట్రీ వారి కోసం.. మీడియా వారి కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఉంటుందని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి యొక్క పెళ్లి గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మిస్టర్.. అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కలిసి నటించాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.
గతంలో సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత కలిసి నటించిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక వీరిద్దరు కూడా కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.