ఇన్ స్టా క్వీన్..బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పై ట్రోలింగ్ కొత్తేం కాదు. ఏదో విషయంలో అమ్మడు ట్రోలింగ్ బారిన పడుతుంటుంది. అప్పుడప్పుడు వాటికి ధీటుగానూ బధులిస్తుంది. తన తప్పు లేనప్పుడు మాత్రం ఊరికునే టైప్ కాదు. చెడుగుడు అడేస్తుంది. అందులోనూ ఆధారాలుంటే అస్సలాగదు. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శిల్పాశెట్టి ఇంటిపరిసరాల్లోనే జాతీయ జెండా ఎగరవేసిన వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
అందులో శిల్పా శెట్టి చెప్పులు వేసుకుని జెండా ఎగరేసింది. దీంతో ట్రోలర్లు ఎటాకింగ్ షురు చేసారు. చెప్పులేసుకుని జాతీయ జెండాని ఎగరేస్తావా? అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీంతో శిల్పా శెట్టికి చిర్రెత్తుకొచ్చింది. రూల్స్ గురించి నాకే చెబుతారా? అంటూ ఎటికింగ్ మొదలు పెట్టింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల (ఫ్లాగ్ కోడ్) గురించి నాకు పూర్తి అవగాహన ఉంది.
చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో ఎక్కడా లేదు. మీరు ఏమైనా కొత్తగా రూల్స్ ఏమైనా పెడితే చెప్పండి. లేక ప్రభుత్వాలు ఏవైనా కొత్త నిబంధలను తీసుకొస్తే చెప్పండి అంటూ ఆడేసుకుంది. దీంతో ఈసారి ట్రోలర్లు అడ్డంగా బుక్ అయ్యారు. సగం నాలెడ్జ్ తో తెలిసి తెలియని కామెంట్లు..పోస్టు పెడితే ఎలా ఉంటుందో మరోసారి శిల్పాశెట్టి అలాంటి వారందరికి రుచి చూపించింది.
తన వాదనకు బలం చేకూర్చేలా గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ షేర్ చేసింది. ట్రోలర్లు తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం.. ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడాన్ని తాను అస్సలు సహించనని చివాట్లు పెట్టింది. వాస్తవాలు తెలుసుకోవాలంటూ వారిని మందలించింది. దీంతో ట్రోలర్ రాజాలంతా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఈసారి ట్రోలర్లు ..శిల్పా శెట్టికి అడ్డంగా దొరికినట్లు అయింది. శిల్పా శెట్టి మద్దతుదారులంతా ఆమెకు సానుకూలంగా పోస్ట్ లు పెడుతున్నారు.