వీడియో : కనిపించిన అనుష్క గుడ్‌ న్యూస్ చెప్పింది

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అనుష్క కు ఏమైందని కొందరు… ఆమె ఆరోగ్యం విషయం లో మరి కొందరు రకరకాలుగా ప్రచారం చేశారు. ఎంతమంది ఏమన్నా కూడా ప్రమోషన్‌ లో అనుష్క కేవలం వినిపించింది కానీ కనిపించలేదు.

తాజాగా సినిమా విడుదల అయి మిశ్రమ స్పందన దక్కించుకుంది. యూఎస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్‌ ను క్రాస్ చేసి అందరిని సర్‌ ప్రైజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల సాలిడ్ వసూళ్లను నమోదు చేయడం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే సినిమా సక్సెస్ విషయాన్ని చాలా సంతోషంగా ప్రకటించారు.

తాజాగా అనుష్క ఒక వీడియోను విడుదల చేసి తన సంతోషాన్ని పంచుకుంది. ప్రమోషన్ సమయంలో కనిపించని అనుష్క తాజాగా ఈ వీడియో లో కనిపించింది. అనుష్క ఎట్టకేలకు కనిపించడం మాత్రమే కాకుండా సినిమా విజయం అయిన నేపథ్యం లో తెలుగు రాష్ట్రాల్లోని ఆడవారికి అన్ని చోట్ల కూడా ఉచితంగా ప్రత్యేక ప్రదర్శన ను చేస్తున్నట్లుగా ప్రకటించారు.

అనుష్క ను చాలా కాలం తర్వాత చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అనుష్క ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ తో లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుష్క గురించి ఆమె లుక్ గురించి జరిగిన ప్రచారం అంతా కూడా అవాస్తవం అని తాజాగా విడుదల చేసిన వీడియో తో అనుష్క క్లారిటీ ఇచ్చింది.

యూవీ క్రియేషన్స్ లో మహేష్ దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా లో నవీన్ పొలిశెట్టి నటన కు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత వంటి స్టార్ ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా చూడలేదు అంటూ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.