సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి పెళ్లి చేసుకున్నారు అని, ఇదే సాక్ష్యం అన్నట్లుగా దండలు వేసుకుని ఉన్న ఫోటోలను చాలా మంది షేర్ చేస్తున్నారు. సాయి పల్లవి ఈ మధ్య కాలంలో సినిమాలు కాస్త తగ్గించింది. పెళ్లి చేసుకోవడం కోసమే సాయి పల్లవి సినిమాలను తగ్గించి ఉంటుందేమో అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవం. ఒక సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా తమిళ్ సాంప్రదాయం ప్రకారం యూనిట్ సభ్యులు అంతా కూడా మెడలో దండలు వేసుకుని పూజ లో పాల్గొన్నారు. సాయి పల్లవి మరియు దర్శకుడు రాజ్ కుమార్ వరకు క్రాప్ చేసి చాలా మంది ఇద్దరి పెళ్లి అంటూ ప్రచారం చేస్తున్నారు.
శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా పూజా కార్యక్రమం సందర్భంగా మెడలో ఉన్న దండలతో కనిపించడంతో పెళ్లి వార్తలు మొదలు అయ్యాయి. సాయి పల్లవి తో విరాట పర్వం సినిమాను రూపొందించిన వేణు ఉడుగుల అసలు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
ఇన్నాళ్లు బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి మెల్ల మెల్లగా స్పీడ్ పెంచింది. తెలుగు లో చాలా కాలం తర్వాత నాగ చైతన్య హీరోగా అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా ఈ సినిమా ప్రకటన వచ్చింది. హీరోయిన్ గా ఇంత బిజీగా ఉన్న సమయంలో సాయి పల్లవి పెళ్లి చేసుకోవడం అనేది పూర్తిగా అవాస్తవం అని తెలిసినా కూడా జనాలు మాత్రం ఫోటోలు చూడగానే ఏదో ఉంది అన్నట్లుగా నమ్ముతున్నారు.