బావ సినిమాపై మ‌హేష్ కాన్పిడెన్స్!

సుధీర్ బాబు హీరోగా న‌టించిన ఏ సినిమాకైనా సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌హ‌కారం ఉంటుంది. స్వ‌యానా సొంత బావ కాబ‌ట్టి మ‌హేష్ ని ఏ ఈవెంట్ కి ఆహ్వానించినా అందుబాటులో ఉంటే హాజ‌ర‌వుతారు. అలా కుద‌ర‌ని ప‌క్షంలో సోష‌ల్ మీడియా ద్వారా బావ సినిమా టీజ‌ర్..ట్రైల‌ర్ రిలీజ్ చేస్తుంటారు. ఆ ర‌కంగా బావ వెంట ఎప్పుడూ బామ్మ‌ర్ది ఉండ‌నే ఉన్నారు. అలాగే టీజ‌ర్..ట్రైల‌ర్ విష‌యంలో జెన్యూన్ ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు.

సినిమాపై సుధీర్ బాబుకి ఏ మాత్రం సందేహం ఉన్నా! అలాంటి ప్రాజెక్ట్ విష‌యంలో మ‌హేష్ని తానే ఇన్వాల్వ్ చేయ‌రు. మ‌హేష్ ఇమేజ్..పేరుని దృష్టిలో పెట్టుకుని అలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా సుదీర్ బాబు హీరోగా న‌టించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా ట్రైలర్ ను మహేశ్ లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం విషెస్ కూడా తెలియ‌జేసారు. ట్రైలర్ ని విడుద‌ల చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసారు. చూస్తుంటే ఈ సినిమా అదిరిపోయే విజయం అందుకునేలా ఉందని అభిప్రాయపడ్డారు.

ఎంత సొంత బావ సినిమా అయినా ఏ సినిమా విష‌యంలో మ‌హేష్ ఇలాంటి వ్యాఖ్య‌లు ఎప్పుడు చేయ‌లేదు. తొలిసారి సినిమా అదిరిపోయేలా ఉంది అంటూ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌ర‌మైన అంశం. మ‌హేష్ మ‌న‌సులో నుంచి వ‌చ్చిన మాట‌గా తెలుస్తోంది. ఆ కామెంట్ మామ మ‌శ్చింద్ర‌కి కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ తీసుకొచ్చేదే. మ‌రి నిజంగా అదిరిపోతుందా? లేదా? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తేలుతుంది.

అయితే మ‌హేష్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే? ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. సినిమా బాగుంటే చూసిన త‌ర్వాత త‌న అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఆ సినిమా హిట్ టాక్ వ‌స్తేనే మ‌హేష్ చూసేది.

లేదంటే ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇవ్వ‌రు. ఈ నేప‌థ్యంలో ‘మామ మ‌శ్చింద్ర’ హిట్ టాక్ తెచ్చుకుంటే మ‌హేష్ చూసి మ‌రోసారి మెచ్చుకో వ‌డం ఖాయం. మ‌హేష్ ప్ర‌శంస సుదీర్ బాబుకి మంచి బూస్టింగ్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయ‌న మహేష్ అభిమాని. కృష్ణ త‌ర్వాత అభిమానించే స్టార్ అత‌నే.