రంభ రీ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌!

చిరంజీవి మొదలుకుని రాజేంద్ర ప్రసాద్‌ వరకు ఎంతో మంది సీనియర్ హీరోలతో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రంభ. ఒకప్పుడు హాట్ బ్యూటీ గా పేరు దక్కించుకున్న రంభ పెళ్లి తర్వాత భర్త మరియు ఫ్యామిలీతో కలిసి మలేషియాలో సెటిల్ అయింది. ఆ మధ్య ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన రంభ పూర్తి స్థాయి లో రీ ఎంట్రీ ఇవ్వలేదు.

తాజాగా రంభ ఒక ప్రముఖ హీరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రంభ ఇక నుంచి కంటిన్యూస్ గా తెలుగు మరియు తమిళ సినిమా ల్లో నటించేందుకు రెడీగా ఉందట. ఆ విషయాన్ని సన్నిహిత దర్శక నిర్మాతలకు ఆమె మెసేజ్ ద్వారా తెలియజేసిందని టాక్ వినిపిస్తోంది.

రంభ రీ ఎంట్రీకి సిద్ధం అయితే ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలను డిజైన్ చేసి మరీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు దర్శకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. యంగ్‌ హీరోలకు అక్క లేదా అత్త పాత్రల్లో రంభ సెట్‌ అవుతుందని కొందరు అంటున్నారు. అయితే రంభ ను అలా చూడలేమని అభిమానులు కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఒకప్పుడు తెలుగు తో పాటు తమిళ్‌ మరియు కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు కూడా ఒక్క భాష అని.. పలానా పాత్రలు మాత్రమే చేయాలనే ఉద్దేశ్యంతో రంభ లేదని తెలుస్తోంది. అందుకే రంభ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రీ ఎంట్రీ తో ఒక్క మంచి పాత్రను దక్కించుకుని, కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంటే రంభ సెకండ్ ఇన్నింగ్స్ కచ్చితంగా జోరుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.