నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా హయ్ నాన్న. ఈ సినిమాలో కూడా నాని ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. దసరా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని హయ్ నాన్న తో కూడా బిగ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా కంటెంట్ తగ్గట్టుగానే ఉంటున్నాయి.
ఇక విడుదలైన మూడు పాటలు కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని పోస్టర్స్ ద్వారానే తెలియజేశారు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన కొన్ని పోస్టర్లు కూడా చాలా కూల్ గా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ కూడా విజువల్ పరంగా ఆడియన్స్ ను కథలోకి చాలా తొందరగా తీసుకు వెళుతుంది అని తెలుస్తుంది. ఎక్కడ కూడా కంటెంట్ కు విరుద్ధంగా వెళ్లకుండానే ప్రతి సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంటుందట.
ఇక రీసెంట్ గా మేకర్స్ కొన్ని ఫొటోలు విడుదల చేశారు. అందులో నాని మృనల్ ఠాగూర్ ఇద్దరూ కూడా చాలా సరదాగా సరస్సులో అలా పడవ ప్రయాణం చేస్తున్నట్లు ఉంది. ఈ ఫిక్స్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఒక కూల్ వైబ్ ఉన్న లవ్లీ సీన్స్ ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాని ప్రేమ కథలతో ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచలేదు.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంతే కొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో టైం ట్రావెల్ లో ఒక డిఫరెంట్ కంటెంట్ కూడా ఉండబోతున్నట్లు గాసిప్స్ అయితే వస్తున్నా యి. కానీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఏ విషయంలోనూ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ కంటెంట్ మాత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాను మిగతా భాషలో కూడా ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఇక సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.