టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో అక్క, అమ్మ, వదిన పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే కూడా సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ వయసులోనూ యువ హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది సురేఖ వాణి. PlayUnmute /
ముఖ్యంగా కూతురుతో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రీల్స్ చేస్తూ కనిపించడం అవి ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమెనే అనుకుంటే ఆమె కూతురు నెక్స్ట్ లెవెల్ లో రచ్చ చేస్తూ సోషల్ మీడియా హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అలా ఈ తల్లీ కూతుళ్లు నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెడుతూ చర్చనీయాంశం అవుతుంటారు.
కాగా ఎలక్షన్ టైమ్ లో BRS పార్టీని గెలిపించడానికి చాలామంది సెలబ్రిటీస్ రీల్స్ చేస్తూ కనిపించారు. అందులో సురేఖ వాణితో పాటూ కూతురు సుప్రీత కూడా ఉన్నారు. ముఖ్యంగా సుప్రీత కారు ముందు నిలబడే BRS ను గెలిపించమని కోరుతూ వీడియో చేసింది. ఇక తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆ వీడియోని డిలీట్ చేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తో ఉన్న ఫోటోను తన స్టోరీగా పెట్టి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.
ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ ఈ తల్లి కూతుళ్ళపై రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియా అంతటా ట్రోల్ చేస్తున్నారు. ఇందులో చాలామంది ‘ఈ తల్లి కూతుర్లు ప్లేట్ ఫిరాయించారంటూ’ కామెంట్స్ చేశారు. అయితే ఈసారి కొంతమంది నెటిజన్స్ ఈ తల్లి కూతుర్లకు సపోర్టుగా నిలిచారు. “ఈ విషయంలో వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని, ఎవరైనా రూలింగ్ పార్టీకే సపోర్ట్ చేయాలని అనుకుంటారు. కాబట్టి అందులో తప్పేముంది” అని కొంతమంది అంటుంటే.
“ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది అది పూర్తిగా ప్రజల నిర్ణయం. ఆ తల్లి కూతుర్ల స్థానంలో ఎవరున్నా గెలిచిన పార్టీకే సపోర్ట్ చేస్తారు. దాన్ని ఇంత రచ్చ చేయడం అవసరమా?” అంటూ మరికొందరు..” గెలిచిన పార్టీకి సపోర్ట్ చేయడం అనేది అందరూ చేసే పనే. అది చాలా సర్వసాధారణం” అంటూ ఇంకొందరు ఈ తల్లి కూతుర్లకు సపోర్ట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.