పృధ్విరాజ్ ని భయపెట్టిన ప్రభాస్ భోజనం..!

రెబల్ స్టార్ ప్రభాస్ ని అందరు డార్లింగ్ అని ఎందుకంటారో చెబుతూ అతనితో పనిచేసిన సెలబ్రిటీస్, టెక్నికల్ టీం చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ తో సినిమా అంటే అందులో నటించే నటీనటులకు ఫుడ్ విషయంలో ఢోకా ఉండదు. పదుల సంఖ్యలో వెరైటీలతో తన ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరికీ పెడతాడు ప్రభాస్.

లేటెస్ట్ గా అదే విషయాన్ని చెబుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్. సలార్ సినిమాలో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న పృధ్విరాజ్ ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక రీసెంట్ గా సలార్ టీం తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తనపై చూపించిన ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పారు.

ఒకసారి తన ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చారు. నా భార్య, పాప రాగా ప్రభాస్ మా బేబీకి ఏయే ఐటంస్ ఇస్టమో అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మా దగ్గరకు పంపించాడు. ముగ్గురుకి చాలా రకాల ఐటమ్స్ పంపించాడు ప్రభాస్. అతను పంపించిన ఫుడ్ కోసం తను అదనంగా ఒక రూం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు పృధ్విరాజ్ సుకుమారన్. అలా ప్రభాస్ తను పంపించే ఫుడ్ ఐటమ్స్ తో అందరినీ భయపెట్టిస్తుంటాడు. ప్రభాస్ కి ఈ అలవాటు పెదనాన్న కృష్ణం రాజు దగ్గర నుంచి వచ్చిందని తెలిసిందే.

కృష్ణం రాజు కూడా షూటింగ్ టైం లో ఇంటి నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించి యూనిట్ అంతా కడుపునిండా తినేలా చూసుకుంటారు. కడుపు నిండా తిని కష్టపడి పనిచేయాలన్నది ఆయన ఫార్ములా. ఈ జనరేషన్ లో ప్రభాస్ ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నాడు. ప్రభాస్ ఫుడ్ హాస్పిటాలిటీ గురించి ఇంతకుముందు అతనితో పనిచేసిన సెలబ్రిటీస్ కూడా ఇదే విధంగా చెప్పారు.

సినిమా కోసం కాదు ప్రభాస్ పంపే ఆ ఐటంస్ కోసం అయినా ప్రభాస్ తో పనిచేయాలని కొందరు అనుకోవడం గ్యారెంటీ. సలార్ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా ఆఫర్ అనగానే ముందు కాదని చెబుదామని అనుకున్నారట పృధ్విరాజ్. ఎందుకంటే ఏదో ఒక చిన్న పాత్ర ఇస్తారని భావించారట కానీ కథ విన్నాక 10 సెకన్లలోనే సినిమా చేస్తా అని చెప్పారట పృధ్విరాజ్. అలా ఆయన సలార్ లో భాగం అయ్యారు.