రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ కొన్నాళ్లగా ప్రేమ ఆస్వాదనలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకుని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకూ దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే పార్టీలు..పబ్ లు..మాల్దీవుల టూర్లు అంటూ చిలౌట్ అవుతున్నారు. రకుల్ ప్రేమలో పడటంకూడా ఇదే తొలిసారి.
దీంతో వీలైనంత సమయాన్ని ప్రియుడితో ఆస్వాదనకే కేటాయిస్తోంది. ఓ వైపు సినిమా లతో బిజీగా ఉన్నా..దొరికిన ఏ క్షణాన్ని వదిలిపెట్టడం లేదు. ఉన్నది ఒక్కటే జీవితం..అది ఎంజాయ్ చేయడానికే అన్నంతగా చిలౌట్ మూవ్ మెంట్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఏ వేడుకొచ్చిన ప్రియుడితోనే సెలబ్రేట్ చేసుకుంటుంది. గతేడాది క్రిస్మస్ సంరద్భంగా జాకీని ఉద్దేశించి శాంటా ఇచ్చిన గిప్ట్ గా చెప్పుకొచ్చింది.
ఎందుకంటే జాకీ పుట్టింది ఇదే రోజు కావడంతో ఆ డేని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసింది. తాజాగా ఆ ప్రేమకు రెండేళ్లు నిండటం సహా మరో పుట్టిన రోజు రావడంతో ప్రియుడిపై తన మనసులో ప్రేమనంతటని ఇలా చాటి చెప్పింది. హ్యాప్పీపీపీ bdayyyyyyy.ఈ పుట్టినరోజు మరియు ప్రతిరోజూ మీరు కోరుకున్నవన్నీ సమృద్ధిగా పొందాలని కోరుకుంటున్నాను. మీ దయ.. అమాయకత్వం దొరకడం చాలా అరుదు.మీ జోకులు నాకెంతో నచ్చుతాయి.
అవి తమాషాగా ఉన్నాయని నేను అంగీకరించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. సాహసాలు.. ప్రయాణం..తినడం మరియు నవ్వడం కలిసి ఎల్లప్పుడూ లవ్ అంటా లవ్ సింబల్స్ ని పోస్ట్ చేసింది. అలాగే ప్రియుడ్ని హత్తుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పొస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో జంట కొత్త ఏడాదిలోనైనా పెళ్లి కబురు చెబుతారా? అంటూ అభిమానులు అడుగుతున్నారు. ఇవన్నీ పెళ్లికి ముందొస్తు సంకేతాలు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.