నాచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. కెరీర్లో డిఫరెంట్ రోల్స్ ఎంచుకొని సినిమా సినిమాకి కొత్తదనం చూపిస్తూ వస్తున్న నాని ఇప్పుడు మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాతో యాక్షన్ మోడ్‌లోకి దిగిన నాని, తర్వాత ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణుతో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ సినిమా తెలంగాణ పల్లెటూరిలో జరిగే పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
నాని ఇదివరకే ‘శ్యామ్ సింగరాయ్’, ‘జెర్సీ’, ‘దసరా’ వంటి సినిమాలలో పీరియాడిక్ కాన్సెప్ట్‌లు టచ్ చేశాడు. అవి అన్ని హిట్లు అయ్యాయి. ఈ సినిమాల్లోని లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నాని, వేణు కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. హీరోయిన్ కోసం వెతుకులాట జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా నాని కెరీర్లో మరో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని అంచనా. తెలంగాణ పల్లెటూరిలో సాగే ఈ ప్రేమకథ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.