న్యూ మెగా కాంబో.. అసలు ఉహించలేదే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని తర్వాత మెగాస్టార్ తో మూవీ కోసం చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకొని జర్నీ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్ లో ఖైదీ 150 నుంచి భోళా శంకర్ వరకు ఆశించిన సక్సెస్ లు బాస్ కి రాలేదు.

అందుకే విశ్వంభర మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మెగాస్టార్ తన కూతురు సుస్మిత కొనెదల నిర్మాణంలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. బ్రోడాడీ రీమేక్ ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో బ్రోడాడీ ఆలోచన క్యాన్సిల్ అయిపొయింది. కళ్యణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ సినిమా చేయాలని అనుకున్నారు.

అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోవడంతో సుస్మిత కొణెదల కోసం మరో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారంట. రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేసాడంట. ఈ కథ చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిపి సుస్మిత కొణెదల ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్.

ఇక హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యతలు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ కావొచ్చు. ఈ లోపు మెగాస్టార్ విశ్వంభర షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు చిరంజీవితో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారంట. అన్ని కరెక్ట్ గా జరిగితే వచ్చే ఏడాది హరీష్ శంకర్ తో మెగాస్టార్ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.