టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే ఎంత త్వరగా స్టార్ ఫేమస్ ను అందుకుందో మళ్లీ అంతే త్వరగా వరుస డిజాస్టర్లు రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. ఇక సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది.
ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోలతో అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను అయితే గట్టిగానే పెంచుకుంటుంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా గట్టిగానే వైరల్ అయ్యాయి. ఇక పూజా హెగ్డేకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినా కూడా బాలీవుడ్ లో మాత్రం మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. అంతే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ మంచి ఆదాయాన్ని పెంచుకుంటుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ తో బాగా వైరల్ అయ్యింది. ఒక ఈవెంట్ కు వెళ్లిన పూజా పాప అక్కడ సరదాగా ఉన్న ఒక బాలీవుడ్ కపుల్ పక్కనుంచి వెళుతూ కనిపించింది. ఆమె వెళుతూ ఉన్న తీరును చూసి చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కపుల్స్ ని చూసినప్పుడు సింగిల్ గా ఉన్నవాళ్లు అలానే వెళతారు అంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేస్తూ ఉన్నారు.
నిజానికి ఆ వీడియోలో ఉన్నది మరెవరు కాదు టాలీవుడ్ లో ఒకప్పుడు బొమ్మరిల్లు సినిమాతో బాగా క్రేజ్ అందుకున్న హాసిని జెనీలియా. ఆమె తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో సరదాగా కెమెరాల ముందు నవ్వుతూ కనిపించింది. కాస్త సరసం గా కూడా కనిపించడంతో పూజా హెగ్డే వారిని చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోయింది. దీంతో మీమర్స్ కు అదే పాయింట్ గా దొరికిపోయింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఏదో ఒక విధంగా పూజా హెగ్డే మాత్రం సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ లో అయితే మంచి సినిమాలే ఉన్నాయి. షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి హీరోలతో ఆఫర్లు వచ్చాయి.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అమ్మడు అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది అంటూ చాలా రోజులుగా గాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.