ప్రభుదేవా-శంకర్-రెహమాన్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన` ప్రేమికుడు`..`జెంటిల్మెన్` అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన సినిమా లు కల్ట్ హిట్ గా నిలిచాయి. రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా స్టెప్పులేస్తుంటే? థియేటర్లు మొతెక్కిపోయాయి. వాటిలో ప్రతీ పాట…ప్రతీ స్టెప్ ఓ వండర్ లా నిలిచింది. ఆ తర్వాత రెహమాన్-ప్రభుదేవా కలయికలో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తంగా ఇద్దరి కాంబినేషన్ లో 1990 ల్లో ఐదు సినిమాలు వచ్చాయి.
అవన్నీ సూపర్ డూపర్ హిట్టే. `లవ్ బర్డ్స్`- మిస్టర్ రోమియో-` మెరుపు కలలులాంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ పెద్ద విజయం సాధించినవే. ప్రభుదేవా అంత గొప్ప డాన్సర్ అయ్యాడంటే? కారణం రెహమాన్ పాటలతోనే సాధ్యమైంది అన్నది అంతే వాస్తవం. నేడు ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా గుర్తింపు పొందాడంటే? రెహమాన్ బీట్స్ తోనే ఆ స్థాకియి చేరుకున్నారు. అలాంటి బీట్స్ లేకపోతే షేక్ చేసే స్టెప్పులు సాధ్యంకానిదే అన్నది ప్రభుదేవా మాట.
తాజాగా రెహమాన్- ప్రభుదేవా ఆరవ ప్రాజెక్ట్ కోసం 25 ఏళ్ల తర్వాత చేతలు కలుపుతున్నారు. ఈ మూవీకి `ఏఆర్ఆర్పీడీ-6` అంటూ ఏఆర్ రెహమాన్ ప్రభుదేవా పేర్లు వచ్చేలా ఓ టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని మనోజ్ ఎస్ పీఎస్ తెరకెక్కిస్తున్నారు. దివ్యమనోజ్-ప్రవీణ్ ఎలాక్ లతో కలిసి నిర్మిస్తున్నారు. అయితే రెహమాన్-ప్రభుదేవా కాంబినేషన్ లో శంకర్ ఉంటే బాగుండుఅనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ముగ్గురు ఉంటే? ఆ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండేదంటూ పోస్టులు పెడుతున్నారు. మరి హిట్ కాంబినేషన్ మధ్యలోకి కొత్త మేకర్ వచ్చిన నేపథ్యంలో ఎలాంటి సినిమా చేస్తాడో? చూడాలి. ప్రస్తుతం ప్రభుదేవా నటనతో పాటు దర్శకుడిగానూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సౌత్ కంటే బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు చేసే ప్లాన్ లో ఉన్నాడు. అవసరం మేర ముఖ్యమైన చిత్రాలకు కొరియోగ్రఫీ కూడా చేస్తున్నారు.