పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’ ఎట్టకేలకు రిలీజ్ కి ఫిక్సైన సంగతి తెలిసిందే. జూన్ 27న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. దీంతో యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్దమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ప్రచారం కూడా అదే ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత వరకూ సినిమాలో నటించిన వారంతా ప్రచారానికి హాజరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్…కోలీవుడ్ నుంచి కమల్ హాసన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
మరి హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొణే పరిస్థితి ఏంటి? అంటే ఆమె గర్భం దాల్చడంతో ప్రచారానికి హాజరయ్యే అవకాశం లేదని రెండు..మూడు రోజులుగా సోషల్ మీడయాలో ప్రచారం సాగుతుంది. దీపిక నెలల గర్భవతి కావడంతో హాజరవ్వడానికి అవకాశాలే లేవని అంతా భావిస్తున్నారు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం దీపిక కేవలం ముంబై వెలుపల మాత్రమే ప్రచారంలో పాల్గొంటుందని ముంబై దాటి వచ్చే అవకాశం లేదని మెజార్టీ వర్గం భావిస్తుంది. హైదరాబాద్..చెన్నై..బెంగుళూరు లో జరిగే ఈవెంట్లకు సంబంధించి దీపిక ప్రచారానికి సంబంధించి కొన్నిరికార్డింగ్లు సిద్దం చేస్తుందని..ఈవెంట్ లో వాటిని ప్రదర్శిస్తారని వినిపిస్తుంది.
మరి నిజంగా అలా జరుగుతుందా? లేక లైవ్ ఈవెంట్లకు హాజరవుతుందా? అన్నది చూడాలి. కరీనా కపూర్… అలియాభట్ లాంటి హీరోయిన్లు తమ సినిమాల్ని గర్భం దాల్చినప్పుడు కూడా ప్రమోట్ చేసారు. హైదరాబాద్ …చెన్నై లాంటి లైవ్ ఈవెంట్లకు హాజరయ్యారు. అన్ని రకాల జాగ్రత్తలతో వాళ్లు ఆ ఈవెంట్లలో పాల్గొన్నారు. అలియాభట్ అయితే గర్భం దాల్చినా షూటింగ్ లో పాల్గోంది. హాలీవుడ్ సినిమా లో యాక్షన్ సన్నివేశాల కోసం రెండు నెలలు గర్భిణీ అయినా పాల్గొంది.
ఆ సమయంలో మెడికల్ ఎమెర్జెన్సీ అన్నింటిని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. స్పాట్ లో అంబులెన్స్..డాక్టర్లను అందుబాటులో ఉంచారు. షూటింగ్ సమయంలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆ సన్నివేశాల్ని పూర్తి చేసింది. దీపిక విషయంలో అంత రిస్క్ అవసరం లేదు. కేవలం ఈవెంట్‌కి హాజరై వెళ్లడమే. ముంబై లో ప్లైట్ ఎక్కితే హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి కారులో హోటల్ కి …ఈవెంట్ స్పాట్ కి మాత్రమే చేరుకుంటుంది. మరి దీపిక ఆ ఛాన్స్ తీసుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.