మాలీవుడ్ తో నయనతారది అవినాభవ సంబంధం. అమ్మడి కెరీర్ మాలీవుడ్ లో ప్రారంభమైంది. అక్కడి గుర్తింపుతోనే తమిళ్..టాలీవుడ్ లో కి వచ్చింది. అయిత ఈ రెండు భాషల్లో అమ్మడు పీక్స్ కి చేరింది. అటుపై పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఇటీవలే బాలీవుడ్ లో కూడా సక్సెస్ అయింది. అయితే ఇలా పేరున్న పరిశ్రమల్లో టాప్ స్టార్ గా కొనసాగినా నయనతార మాత్రం మాలీవుడ్ ని ఏ నాడు దూరం పెట్టలేదు. అడపా దడపా అక్కడా సినిమాలు చేస్తూ వస్తోంది. వచ్చిన అవకాశాన్ని వినియోగిం చుకుంది.
ఇలా ఇంతవరకూ మాలీవుడ్ స్టార్ మమ్ముట్టితో రెండు సినిమాలు చేసింది. `రాప్కల్`..` బాస్కర్ ద రాస్కెల్`..`పుతియా నియామామ్` సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జోడీ చేతులు కలుపుతుంది. మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ మలయాళంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాని స్వయంగా మమ్ముట్టి నిర్మించడం విశేషం. ఇంతవరకూ మమ్ముట్టి ఐదు సినిమాలు నిర్మించాడు.
గౌతమ్ సినిమాతో ఆరవది అవుతోంది. దీంతో మమ్ముట్టి ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? అన్నది అభిమా నుల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఇందులో మమ్ముట్టికి జోడీగా నయనతారను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గౌతమ్ రాసుకున్న పాత్రకు నయన్ అయితే పక్కాగా సరితూగుతుందని ఆమెని ఒప్పించినట్లు తెలుస్తుంది. సింగిల్ సిట్టింగ్ లోనే నయన్ ఈ పాత్రని లాక్ చేసిందిట. మమ్ముట్టి-నయన్ జోడీకి అక్కడ మంచి గుర్తింపు ఉంది. ఇద్దరు భార్య భర్తలుగానూ నటించి మెప్పించారు.
మళ్లీ చాలా కాలం తర్వాత ఇద్దరు జత కట్టడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. మరి ఇందులో నయన్ ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నది చూడాలి. ప్రస్తుతం నయనతార తమిళ్ లో ఎంత బిజీగా ఉందో తెలిసిం దే. చాలా సినిమాలకు కమిట్ అయింది. బాలీవుడ్ లోనూ కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయి.